హైదరాబాద్: భారతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఐఐటీ) హైదరాబాద్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు అక్టోబర్ 10 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, జూనియర్ ఇంజినీర్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 24
ఇందులో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), సీనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్ ఆఫీసర్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ జీఆర్ ఒక్కో పోస్టు చొప్పున, జూనియర్ ఇంజినీర్ 4 (సివిల్-2, ఎలక్ట్రికల్ 2), టెక్నికల్ సూపరింటెండెంట్ 7, జూనియర్ టెక్నీషియన్ 8 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్, ఎంటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ ఫిజిక్స్ చేసి ఉండాలి. అభ్యర్థులు 40 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: రూ.500
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 11
వెబ్సైట్: link: https://iith.ac.in/careers/