న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని డీఆర్డీఓ.. జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ అందిస్తున్నది. బెంగళూరులోని ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ (సీఏబీఎస్)లో జేఆర్ఎఫ్లు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 జేఆర్ఎఫ్లను భర్తీ చేస్తున్నది. ఇవి ఏరోడైనమిక్స్, స్టక్చురల్ డిజైన్ అనాలిసిస్, రాడార్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, నెట్వర్కింగ్ అండ్ డిస్ల్పే సిస్టమ్స్, మిషన్ కంప్యూటర్ తదితర విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం జేఆర్ఎఫ్లు: 20
ఇందులో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 9, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్ చేసీ వ్యాలిడ్ గేట్ స్కోర్ లేదా ఎంఈ/ఎంటెక్‌లో ఫస్ట్ డివిజన్ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 30
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా. గేట్ స్కోర్, డిగ్రీ లేదా పీజీలో వచ్చిన మార్కులను బట్టి ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.
వెబ్సైట్: www.drdo.gov.in