హైదరాబాద్: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రాఫిక్ ల్యాబొరేటరీల (ఎన్‌పీఓఎల్)లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)లు అందిస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్, బాలిస్టిక్ సైన్స్‌లో బీటీ, బీటెక్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై.. నెట్, గేట్లలో ఏదైనా ఒకదానిలో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా ఎంఈ, ఎంటెక్ ఫస్ట్ డివిజన్లో పాసవ్వాలి. అభ్యర్థులు 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 28
వెబ్సైట్: drdo.gov.in