న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ)లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 18 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 606 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 606
ఇందులో ఎగ్జిక్యూటివ్ 1, రిలేషన్షిప్ మేనేజర్ 314, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ 217, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 12, సెంట్రల్ రిసెర్చ్ టీమ్ (ప్రోడక్ట్ లీడ్) 2, మార్కెటింగ్ మేనేజర్ 12, మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ 26 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 35 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 18
వెబ్సైట్: sbi.co.in