e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home నిజామాబాద్ సీఎం సభాస్థలి పరిశీలన

సీఎం సభాస్థలి పరిశీలన

సీఎం సభాస్థలి పరిశీలన

నిజాంసాగర్‌, మార్చి 28: మండలంలోని ఒడ్డేపల్లి కోమలంచ గ్రామాల శివారులో మంజీరానది పరీవాహక ప్రాంతంలో నిర్మించనున్న నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ ఆదివారం పరిశీలించారు. మత్తడి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.476 కోట్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. మత్తడి నిర్మించే ప్రదేశంలో పైలాన్‌ ఏర్పాటు, జక్కాపూర్‌ గేటు వద్ద హెలీప్యాడ్‌, మల్లూర్‌ శివారులో రైతులతో నిర్వహించనున్న సమావేశ స్థలాలను వారు పరిశీలించారు. సీఎం పర్యటన విజయవంతం చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే షిండే తెలిపారు. సీఎం పర్యటన ఏప్రిల్‌ రెండో తేదీన ఉందని, అధికారికంగా సోమవారం నాటికి షెడ్యూల్‌ ఖరారు అవుతుందని చెప్పారు. సభావేదిక, పైలాన్‌ ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ వచ్చే దారిని బాగు చేయాలని, హెలీప్యాడ్‌ను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట ఆర్డీవో రాజాగౌడ్‌, ఈఈ రమేశ్‌, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, డీఈఈ దత్తాద్రి, స్థానిక నాయకులు దుర్గారెడ్డి, విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, నాయకులు విఠల్‌రెడ్డి, బాబుసేట్‌, రమేశ్‌, గోరేమియా, ఏఈ శివ, తహసీల్దార్‌ వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

ఇవీ కూడా చదవండి..

ఇండియా విజ్ఞ‌ప్తి డోంట్ కేర్‌..సౌదీ ప్ర‌తి స‌వాల్‌!

త్వ‌ర‌లో జియో లాప్‌టాప్‌.. చౌక‌గానే?!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం సభాస్థలి పరిశీలన

ట్రెండింగ్‌

Advertisement