e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home నిజామాబాద్ ‘సీఎంఆర్‌ఎఫ్‌'తో భరోసా

‘సీఎంఆర్‌ఎఫ్‌’తో భరోసా

‘సీఎంఆర్‌ఎఫ్‌'తో భరోసా

ఆర్మూర్‌, జూన్‌ 23: సీఎంఆర్‌ఎఫ్‌తో బాధితుల ఆరోగ్యానికి భరోసా ఏర్పడుతున్నదని పలువురు నాయకులు అన్నారు. వివిధ గ్రామాల్లో పలువురికి మంజూరైన చెక్కులను నాయకులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఆర్మూర్‌ మున్సిపల్‌, ఆర్మూర్‌, నందిపేట్‌, మాక్లూర్‌ మండలాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నాయకులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గవ్యాప్తంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు తనదృష్టికి తీసుకవచ్చి సీఎంఆర్‌ఎఫ్‌తో లబ్ధి పొందాలని సూచించారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

చెక్కులు అందజేసిన నాయకులు..
ఆర్మూర్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత, టీఆర్‌ఎస్‌ నాయకులు పండిత్‌ పవన్‌, పండిత్‌ ప్రేమ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా, పలువురు మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఆర్మూర్‌ మండలంలో పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కోమన్‌పల్లిలో సర్పంచ్‌ నీరడి రాజేశ్వర్‌, ఉపసర్పంచ్‌ రంజిత్‌గౌడ్‌, చేపూర్‌లో సర్పంచ్‌ టిసి.సాయన్న, ఉపసర్పంచ్‌ శ్రీనివాస్‌, అంకాపూర్‌లో సర్పంచ్‌ మచ్చర్ల పూజితరెడ్డి, ఉపసర్పంచ్‌ కిశోర్‌రెడ్డి, గోవింద్‌పేట్‌లో సర్పంచ్‌ బండమీది జమున, ఉపసర్పంచ్‌ బండమీది గంగాధర్‌, ఇస్సాపల్లిలో దార్ల దీవెన రాజు, ఆలూర్‌లో సర్పంచ్‌ కల్లెం మోహన్‌రెడ్డి, మచ్చర్లలో సర్పంచ్‌ గంజి నర్సయ్య, దేగాంలో సర్పంచ్‌ గడ్డం సరోజన, ఫత్తేపూర్‌లో సర్పంచ్‌ కొత్తపల్లి లక్ష్మి, సుర్బిర్యాల్‌లో సర్పంచ్‌ సట్లపల్లి సవిత గణేశ్‌ లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.

- Advertisement -

మాక్లూర్‌ మండలంలో..
మాక్లూర్‌, జూన్‌ 22: మండలంలోని మదన్‌పల్లి, గుంజిలి, అమ్రాద్‌, మానిక్‌బండార్‌ గ్రామాల్లో పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీపీ మాస్త ప్రభాకర్‌ అందజేశారు. 228 కల్యాణలక్ష్మి, 67 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు శంకర్‌గౌడ్‌, శేఖర్‌, సింగరి లింగన్న, 2వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాయ్‌సింగ్‌, ఎంపీటీసీలు సత్యనారాయణ, ఒడ్డెన్న, లక్ష్మి, సుక్కి సుధాకర్‌, రంజిత్‌, భూషణ్‌, శేఖర్‌రావు, ధన్‌కాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏర్గట్ల మండలంలో..
ఏర్గట్ల, జూన్‌ 23: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో మండలంలో 51 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరు అయ్యాయని ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణానందం అన్నారు. ఏర్గట్లలోని టీఆర్‌ఎస్‌ కా ర్యాలయం వద్ద లబ్ధిదారులకు బుధవారం చెక్కులను వారు అందజేశారు. చెక్కులు అందుకున్న వారు సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్‌, ఆయా గ్రామాల సర్పంచులు గుల్లే లావ ణ్య, పత్తిరెడ్డి ప్రకాశ్‌ రెడ్డి, కుండ నవీన్‌, గద్దె రాధ, సొసైటీ చైర్మన్లు బర్మ చిన్ననర్సయ్య, పెద్దకాపు శ్రీనివాస్‌రెడ్డి, ఏర్గట్ల వైస్‌చైర్మన్‌ గంగారాం, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు గుల్లె గంగాధర్‌, నాయకులు శ్రీనివాస్‌ గౌడ్‌, గంగారాం నాయక్‌, భూమ న్న, రాధారపు సహదేవ్‌, ఏర్గట్ల ఉపసర్పంచ్‌ సున్నపు గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

వేల్పూర్‌లో..
వేల్పూర్‌, జూన్‌ 23: మండలంలోని 52 మం దికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగధర్‌ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చెక్కుల మంజూరుకు కృషిచేసిన మంత్రి వేములకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ భీమ జమున, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొట్టాల చిన్నారెడ్డి, ఆర్టీ సభ్యుడు రేగుల్ల రాములు, వైస్‌ ఎంపీపీ బోదపల్లి సురేశ్‌, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

నందిపేట్‌ మండలంలో..
నందిపేట్‌ రూరల్‌, జూన్‌ 23: నందిపేట్‌ మండలం శాపూర్‌ గ్రామంలో ముగ్గురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మద్దుల మురళి, పెద్దగొండ మోహన్‌, లింబాగౌడ్‌, వార్డు సభ్యులు చిన్నయ్య, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘సీఎంఆర్‌ఎఫ్‌'తో భరోసా
‘సీఎంఆర్‌ఎఫ్‌'తో భరోసా
‘సీఎంఆర్‌ఎఫ్‌'తో భరోసా

ట్రెండింగ్‌

Advertisement