e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home నిజామాబాద్ యోగాతో ఆరోగ్యం పదిలం

యోగాతో ఆరోగ్యం పదిలం

యోగాతో ఆరోగ్యం పదిలం

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్‌ 21: యోగాతో ఆరోగ్యం పదిలమని యోగా గురువులు తెలిపారు. జిల్లా కేం ద్రంతోపాటు పలు మండలాల్లో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని దయానంద్‌ యోగా సెంటర్‌లో యోగా గురువు భూమాగౌడ్‌ యో గా, ప్రాణాయామంపై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ నిత్యం యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. యోగాతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జీవన్‌రావు, డాక్టర్‌ విశాల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తెలంగాణ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో, వాసవి క్లబ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అండ్‌ వాసవి క్లబ్‌ వనితా ఇందూరు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించగా.. వీసీ రవీందర్‌ హాజరయ్యారు. విశ్వవిద్యాలయ స్థాయిలో యోగా కోర్సులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు పంపుతామని వీసీ అన్నారు. ఈ సందర్భంగా యోగా గురువులు సిద్ధిరాములు, రామ్‌చందర్‌ను సన్మానించారు. అనంతరం వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో కూలీలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు.

బోధన్‌ పట్టణంలోని శ్రీవిజయసాయి హైస్కూల్‌ ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పలువురు యోగాసనాలు వేశారు. శ్రీ విజయసాయి హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణమోహన్‌, మేనేజర్‌ ఐఆర్‌ చక్రవర్తి, లయన్స్‌ వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ లయన్‌ లక్ష్మీ బసవేశ్వరరావు పాల్గొన్నారు. బోధన్‌లోని దయానంద్‌ గోశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బోధన్‌ మండలం మందర్న గ్రామశివారులోని మంజీరానది తీరంలో ఓం యోగశాల బోధన్‌ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బోధన్‌ పట్టణం శక్కర్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పెరిక వెంకటేశ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా బీజేపీ సీనియర్‌ నాయకుడు నర్సింహారెడ్డి హాజరయ్యారు. రెంజల్‌ కస్తూర్బాలో యోగా దినోత్సవం నిర్వహించారు.

- Advertisement -

ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లో విద్యా హైస్కూల్‌ ఆవరణలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో యోగా గురువు రాజేందర్‌ను సన్మానించారు. ఆర్మూర్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు బొడ్డు భీమయ్యను సన్మానించారు. మాక్లూర్‌ మండలం మామిడిపల్లి, మాక్లూర్‌, మానిక్‌బండార్‌, అమ్రాద్‌ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో యువకులు, విద్యార్థులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. డిచ్‌పల్లిలోని రాష్ట్ర పోలీసు 7వ బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎన్‌వీ సత్యశ్రీనివాసరావు ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. రుద్రూరు మండల కేంద్రంలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో పలు ఆసనాలను వేసి ప్రజలకు వాటితో కలిగే ప్రయోజనాలను వివరించారు. చందూర్‌ ఉన్నత పాఠశాలలో తపస్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు.

జిల్లా కోర్టులో..
యోగాతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా జడ్జి, న్యాయ సేవా అధికార సంస్థ చైర్‌పర్సన్‌ సాయిరమాదేవి అన్నారు. న్యాయసేవా సదన్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. యోగాతో శరీరం దృఢంగా తయారవుతుందని, తద్వా రా మనిషి ఆరోగ్యవంతుడిగా జీవించగలుగుతాడన్నారు. సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి జగన్నాథం విక్రమ్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు భవ్య, సౌందర్య, గిరిజ, న్యాయవాదులు రాజ్‌కుమార్‌ సుబేదార్‌, మాణిక్‌రాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
యోగాతో ఆరోగ్యం పదిలం
యోగాతో ఆరోగ్యం పదిలం
యోగాతో ఆరోగ్యం పదిలం

ట్రెండింగ్‌

Advertisement