e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home నిజామాబాద్ ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు

ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు

ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు

నమస్తే తెలంగాణ యంత్రాం గం, మే 17 : ధర్పల్లిలో 38 మందికి పరీక్షలు నిర్వహించగా 10మందికి పాజిటివ్‌ వచ్చిందని మెడికల్‌ ఆఫీసర్‌ రఘువీర్‌ తెలిపా రు. జక్రాన్‌పల్లి పీహెచ్‌సీలో 36 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్‌, మోపాల్‌ మండలంలో 20 మంది కి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పీహెచ్‌సీ డాక్టర్‌ నవీన్‌ తెలిపారు. పొతంగల్‌ పీహెచ్‌సీలో 35 మందికి టెస్టు చేయగా 2, కోటగిరి సీహెచ్‌సీలో 40 మందికి టెస్టు చేయగా ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. రుద్రూర్‌ పీహెచ్‌సీలో 27 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డాక్టర్‌ దిలీప్‌ తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో 30మందికి పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న, భీమ్‌గల్‌ పీహెచ్‌సీలో 57 మందికి పరీక్షలు చేయగా.. 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యుడు అజయ్‌పవార్‌ తెలిపారు.

సాలూరా పీహెచ్‌సీలో 43 మందిని పరీక్షించగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వారికి ఐసొలేషన్‌ కిట్లు అందజేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించామని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేఖ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ దవాఖానలో 58 మందికి సోమవారం పరీక్షలు చేయగా.. ఐదుగురికి, రాకాసీపేట్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో 18 నిర్వహించగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్య సిబ్బంది తెలిపారు. ఎడపల్లిలోని పీహెచ్‌సీలో 33 మందికి పరీక్షలు చేయగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదన్నారు. మాక్లూర్‌ పీహెచ్‌సీలో 19 మందిని పరీక్షించగా ముగ్గురికి, కల్లడి పీహెచ్‌సీలో 15 మందిని పరీక్షించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు సంజీవ్‌రెడ్డి, సిఖిందర్‌నాయక్‌ తెలిపారు. వారం రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వారు పేర్కొన్నారు.

మోర్తాడ్‌ సీహెచ్‌సీలో 41 మందికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి, చౌట్‌పల్లి పీహెచ్‌సీలో 22 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు సుమంత్‌, రతన్‌సింగ్‌ తెలిపారు. రెంజల్‌ పీహెచ్‌సీ, కందకుర్తి చెక్‌పోస్టు వద్ద కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 11 మందికి పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. బాధితులకు ఐసొలేషన్‌ కిట్లు అందజేశామని చెప్పారు. ఆర్మూర్‌లో మొత్తం 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు నాగరాజు, ఆయేషా ఫిర్దోస్‌, భాస్కర్‌రావు తెలిపారు. ఆర్మూర్‌ ఏరియా దవాఖానలో 49 మందిని పరీక్షించగా ఎనిమిది మందికి, హౌసింగ్‌ బోర్డులోని పీహెచ్‌సీలో 40 మందిని పరీక్షించగా ఐదుగురికి, దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 13 మందిని పరీక్షించగా ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు

ట్రెండింగ్‌

Advertisement