e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home నిజామాబాద్ ‘రైతు బంధు’వు.. కేసీఆర్‌

‘రైతు బంధు’వు.. కేసీఆర్‌

‘రైతు బంధు’వు.. కేసీఆర్‌

ఏర్గట్ల/ముప్కాల్‌, జూన్‌ 16: కరోనా కష్టకాలంలో అన్నదాతలకు పెట్టుబడి కోసం డబ్బులు అందజేస్తున్న సీఎం కేసీఆర్‌ రైతుబంధువు అని పలువురు నాయకు లు, ప్రజా ప్రతినిధులు, రైతులు కొనియాడారు. రైతుబంధు డబ్బులు అన్నదాత బ్యాంకు అకౌంట్లలో జమ అవుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు బుధవారం పా లాభిషేకం చేశారు. ఏర్గట్లలోని రైతువేదిక భవనంలో ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్‌రెడ్డి, జడ్పీటీసీ గుల్లే రాజేశ్వ ర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం, రైతుబంధు మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. స ర్పంచ్‌ గుల్లే లావణ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్‌, సొసైటీ చైర్మన్‌ బర్మ చిన్ననర్సయ్య, వైస్‌ చైర్మన్‌ గంగారాం పాల్గొన్నారు.

బాల్కొండలోని రైతువేదిక భవనంలో సీఎం కేసీఆర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నాగులపల్లి రాజేశ్వర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శ్రీకాంత్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేశ్‌, తౌటు గంగాధర్‌, సర్పంచ్‌ బూస సునీత, నాయకులు లింగాగౌడ్‌, ఆకుల నరేందర్‌, పోశెట్టి, పన్నాల గంగారెడ్డి, పుప్పాల విద్యాసాగర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ వేంపల్లి చిన్న బాల్‌రాజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్‌లోని రైతువేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ నాగంపేట్‌ ముత్తెన్న, ఎంపీపీ సామ పద్మ, సీనయర్‌ నాయకుడు సామ వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు గడ్డం ప్రతాప్‌రెడ్డి, నిమ్మల నర్సయ్య, కొత్తపల్లి ఎంపీటీసీ జ్యోతి, నాయకులు వెంకట్‌రాజు, ఉమాశంకర్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

30 శాతం వేతనాన్ని పెంచడాన్ని హర్షిస్తూ..
ప్రజాప్రతినిధులకు 30 శాతం వేతనం పెంచడాన్ని హర్షిస్తూ నవీపేటలో ఎంపీపీ సంగెం శ్రీనివాస ఆధ్వర్యంలో ఎంపీటీసీలు కలిసి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు సర్పంచులకు వేతనాలు పెంచడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మార్నేని కృష్ణమోహన్‌రావు, ఎంపీటీసీలు బేగరి బుచ్చన్న, సతీశ్‌, నాయకులు నీరడి బుచ్చన్న, బట్టు లక్ష్మణ్‌రావు, గైని మోహన్‌, రాజన్న, సంజీవ్‌కుమార్‌, నవీన్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సాటాపూర్‌లో..
రెంజల్‌, జూన్‌ 16: అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తల గౌరవ వేతనం 30శాతం పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సాటాపూర్‌ సర్పంచ్‌ వికార్‌పాషా, ఎంపీటీసీ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘రైతు బంధు’వు.. కేసీఆర్‌
‘రైతు బంధు’వు.. కేసీఆర్‌
‘రైతు బంధు’వు.. కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement