e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home కామారెడ్డి వెనుకబాటుపై ముందడుగు…!

వెనుకబాటుపై ముందడుగు…!

వెనుకబాటుపై ముందడుగు…!

నిజామాబాద్‌, జూలై 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కా లం ఎంతగా మార్పు చెందుతున్న గ్రామాల్లో నేటికీ కొంత మంది దళిత కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సా మాజిక వివక్షకు, అణచివేతకు గురైన అణగారిన వర్గాలను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఘోరమైన దుస్థితి నెల కొ ంది. దళిత కుటుంబాలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. రూ.వేల కోట్లు వెచ్చించైనా సరే గ్రామాల్లో దళిత కుటుంబాల్లో ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచి వారిలో చీకట్లను తొలగించాలని నిర్ణ యించారు. ఈ మేరకు కామారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌ చెప్పినట్లుగానే వారం రోజులు తిరగకముందే దళిత సాధికారత పథకానికి సంబంధించిన సన్నాహక సమావే శాన్ని నిర్వహించారు.

జూన్‌ 27న జరిగిన దళిత ప్రజా ప్రతినిధు లు, అఖిలపక్ష సమావేశంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై హర్షాతి రేకాలు వ్యక్తం అయ్యాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దళితుల కుటుంబాల్లో శాశ్వత వెలుగులు నింపే కార్యక్రమం నేటికీ అమలు కాకపోవడంపై కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలకమైన చర్చ జరిగింది. దళిత సాధికారత పథకం రూపకల్పనకు కేసీఆర్‌ నడుం బిగించడంతో ఆ వర్గాల్లో సంతోషం వెల్లువెత్తుతున్నది. ఇదిలా ఉండగా దళిత మేధావులు, ప్రముఖులతో సోమవారం మద్నూర్‌లో జుక్కల్‌ శాసనసభ్యుడు హన్మంత్‌ షిండే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో దళిత సాధికారత పథకంపై చర్చించనున్నారు.

- Advertisement -

గురుకులాలతో విద్యాభివృద్ధి…
స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌ అట్టడుగు వర్గాలను ఆదుకునేందుకు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రధానంగా విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించారు. ఒకప్పుడు నిజా మాబాద్‌, కామారెడ్డి వంటి జిల్లాల్లో మెరుగైన, నాణ్యమైన విద్య అందాలంటే దళిత కుటుంబాలకు పగటి కలగానే ఉండేది. కేసీఆర్‌ ప్రారంభించిన గురుకులాలతో కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా వసతి, చదువు పూర్తి ఉచితంగా అందుతుండడంతో దళిత, గిరిజన కుటుంబాల్లో విద్యాభివృద్ధి గణనీయంగా జరిగింది. కామారెడ్డి జిల్లాలో 11 సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు నెలకొల్పగా ఇందులో నాలుగు బాలురకు, ఏడు బాలికలకు ఉన్నాయి. సదా శివనగర్‌లో మహిళా ఎస్సీ డిగ్రీ గురుకులం సైతం ఏర్పాటైంది. నిజామాబాద్‌ జిల్లాలో 9 సోషల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాల లున్నాయి. ఇందులో 6 బాలికల కోసం, 3 బాలుర కోసం ఏర్పా టు చేశారు. 2 మహిళా డిగ్రీ ఎస్సీ గురుకులాలు సైతం ఉన్నాయి. వేలాది మంది దళిత కు టుంబాలకు చెందిన విద్యార్థులు ఇందులో ఉచితంగా నాణ్యమైన విద్యను అందిపుచ్చు కుంటున్నారు.

వెన్నుదన్నుగా కేసీఆర్‌…
అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత కుటుంబాలను పైకి తీసుకు రా వడం కోసం సీఎం కేసీఆర్‌ మొదట్నుంచి వెన్నుదన్నుగా ని లుస్తున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు, రాయితీ రుణాల తో యువతకు ఉపాధి మార్గాలు చూపించారు. భారీ రాయి తీలతో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణాలు సైతం అందించా రు. అంతే కాకుండా దళితులను ఉన్నతీకరించే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ మూడెకరాల సేద్యపు భూమిని ఉచితంగా అందించారు. ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల వివరాల ప్రకా రం కామారెడ్డి జిల్లాలో 1,183 ఎకరాల భూమిని దాదాపు రూ.54కోట్లు వెచ్చించి 509 దళిత కుటుంబాలకు అం దించారు. పంపిణీ చేసిన భూమిని అ భివృద్ధి చేసేందుకు 429 దళిత లబ్ధిదారులకు రూ.1.68 కోట్ల ని ధులను మంజూరు చేశారు. అంతేకాకుండా నిజామాబాద్‌ జిల్లాలోనూ దాదాపుగా ఆరు వందల మంది దళిత కుటుంబాలకు మూడెకరాల భూమిని అందించినట్లు సమాచారం. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశా లు అందిపుచ్చుకునేందుకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించారు. అంబే ద్కర్‌ ఓవర్‌సీస్‌ పథకం ద్వారా విదేశాల్లో పీజీ కోర్సులు చదివే వారికి రూ.20లక్షలు ఆర్థిక సాయం ద్వారా వారికి కేసీఆర్‌ ఊ తంలా నిలిచారు.

పక్కాగా పకడ్బందీగా…
నూతన పథకంపై సీఎం కేసీఆర్‌ కార్యాచరణ ప్రణాళికపై అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. దళిత సాధికారత పథకంపై గ్రామ స్థాయిలోనూ ఆయా కుటుంబాల నుంచి మంచి స్పందన వస్తున్నది. అధునాతన సాంకేతిక విధానాలను అవలంబించి ప్రభుత్వ ప్రయోజనం పొందే దళిత కుటుంబాలకు ప్రత్యేకంగా బార్‌ కోడ్‌ను కేటాయించనున్నారు. దళిత విద్యార్థుల కోసం హై క్వాలిటీ స్టడీ సర్కిల్‌ను పెట్టేందుకు యోచిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా సివిల్‌ సర్వీసెస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ అందించాలని సీఎం ఆదేశించారు. రైతుబంధు పంపిణీలో దళిత లబ్ధిదారుల వివరాలు సేకరించనున్నారు. కింది స్థాయిలో ఉన్న దళితులకు సహాయం అందేలా చర్యలు చేపట్టబోతున్నారు. పెండింగ్‌లో ఉన్న దళిత ఉద్యోగుల ప్రమోషన్లను 10 నుంచి 15 రోజుల్లోనే పూర్తి చేయాలని నిర్ణ యించా రు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతులకు రైతుబంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూ డా వర్తింపజేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ చేసుకుంటున్న దళిత రైతులకు రైతు బంధుతో పాటు అర్హత కలిగిన వారికి సీఎం దళిత సాధికారత పథకం కూడా అంది స్తారు. భూమి ఉన్న దళిత రైతులకే కాకుండా భూమి లేని నిరుపే ద దళిత కుటుంబాలకు కూడా బీమా సౌకర్యం కల్పించాలని కేసీ ఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో రెండు రోజులు పాటు దళిత వాడల సందర్శించి ఆయా ప్రాంతా ల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేలా కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు.

దళిత బాంధవుడు సీఎం కేసీఆర్‌…
దేశంలో దళిత ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే. ఏ రాష్ట్రంలో జరగని విధంగా సంక్షేమ పథకాల ద్వారా అనేక ఫలాలు అందిస్తున్నారు. అట్టడుగు వర్గాలను పైకి తీసుకు రావడానికి ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం రూపకల్పనకు పూనుకున్నారు. నేరుగా ఆర్థిక సాయం అందించి దళిత కుటుంబాలను పేదరికం నుంచి దూరం చేయాలనే ఆలోచన అద్భుతం. సీఎం ఆలోచనల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, దళిత బిడ్డల సలహాలు, ఆలోచనలను ప్రభుత్వానికి అందివ్వడానికి సమావేశం ఏర్పాటు చేశాను.

  • హన్మంత్‌ షిండే, జుక్కల్‌ శాసనసభ్యుడు
    సీఎం సార్‌కు కృతజ్ఞతలు
    దళితుల అభ్యున్నతి కోసం దళిత సాధికారత పథకం ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. గత ప్రభుత్వాలు దళితుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. కానీ నిజంగా పేదలకు గురించి ఆలోచిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఒక్కటే..
    -మన్నె సాయిలు ( బోర్లం)

దళితులకు మంచి రోజులు
దళితులకు టీఆర్‌ఎస్‌ హయాంలో మంచి రోజులు వచ్చాయి. ఎంతో కాలంగా దళితులను పట్టించుకున్న వారు లేరు. వివక్షకు గురైన దళితులను సీఎం కేసీఆర్‌ అక్కున చేర్చుకొని దళిత సాధికారత పథకం ప్రకటించడం హర్షణీయం. పేద దళితులకు రూ.10 లక్షల సాయం అందించడంతో కష్టాలు గట్టెక్కుతాయి. సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కు రుణపడి ఉంటాం.
-రాజు, తాడ్కోల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వెనుకబాటుపై ముందడుగు…!
వెనుకబాటుపై ముందడుగు…!
వెనుకబాటుపై ముందడుగు…!

ట్రెండింగ్‌

Advertisement