e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 8, 2021
Home నిజామాబాద్ సంఘ సంస్కర్తకు ఘననివాళి

సంఘ సంస్కర్తకు ఘననివాళి

సంఘ సంస్కర్తకు ఘననివాళి

నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్‌ 11 : సంఘ సంస్కర్త, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహా త్మా జ్యోతిబా పూలే జయంతిని జిల్లాలో ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. పూలే అందించిన సేవలను స్మరించుకున్నారు. పూలే ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న పూలే విగ్రహానికి ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్‌, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతిరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు అపర్ణ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సంతోష్‌, టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌గౌడ్‌, నాయకులు జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బహుజన కాలనీ సేవా సొసైటీ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని జీనియస్‌ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి కరస్పాండెంట్‌ గంగారెడ్డి, డైరెక్టర్‌ అరుంధతి, బీసీ వెల్ఫేర్‌ టీచర్లు శివాజీ, హన్మాండ్లు క్షీర, పుష్పాభిషేకం నిర్వహించారు.

ధర్పల్లి తహసీల్‌ కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఐ రవి, వీఆర్‌ఏ రాములు, నర్సయ్య, ఆపరేటర్‌ జలంధర్‌, సిబ్బంది తదితరులు పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద దళిత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్‌ అసోసియేషన్‌ సమావేశపు హాలులో జ్యోతిబా పూలే చిత్రపటానికి న్యాయవాదులు నివాళులు అర్పించా రు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాదస్తు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్‌, న్యాయవాదులు బాస రాజేశ్వర్‌, మాణిక్‌రాజ్‌, దేవీదాస్‌, బిట్ల రవి, ఉదయకృష్ణ, రవిప్రసాద్‌, యెండల ప్రదీప్‌, పులి జైపాల్‌, ఆశ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఇందల్వాయి మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో జ్యోతి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రుద్రూర్‌లో బహుజన విద్యావంతుల వేదిక, దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. సిరికొండలోని సత్యశోధక్‌ పాఠశాలలో ప్రిన్సిపాల్‌ ఆర్‌.నర్సయ్య, సిబ్బంది పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించా రు.
ఆర్మూర్‌ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఎంబీసీ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ మానస గణేశ్‌, పలు కుల సంఘాలు, ఆల్‌ ఇండియా అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా కన్వీనర్‌ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో, బీజేపీ నాయకులు, మండలంలోని గగ్గుపల్లిలో యువజన సంఘం ఆధ్వర్యంలో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.


భీమ్‌గల్‌ మండల కేంద్రంలోని ముచ్కూర్‌ చౌరస్తాలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ గున్నాల బాలభగత్‌, కౌన్సిలర్లు ధరావత్‌ లింగం, నర్సయ్య, సతీశ్‌, గంగాధర్‌, సర్వసమాజ్‌ కమిటీ అధ్యక్షుడు చిన్న పాపారాయుడు, దళిత ఐక్య సంఘటన్‌ సభ్యు లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.వేల్పూర్‌ మండలంలోని పచ్చలనడ్కుడ, రామన్నపేట్‌, వేల్పూర్‌, పడగల్‌, అంక్సాపూర్‌ గ్రామాల్లో జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని జ్యోతిబా ఫూలే విగ్రహానికి ఎంపీపీ శివలింగు శ్రీనివాస్‌, డీసీసీబీ డైరెక్టర్‌ ముత్తెన్న, సొసైటీ వైస్‌చైర్మన్‌ దడివె నవీన్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దళిత సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మల్లూరి రాజారాం ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించారు.ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి డల్ల సురేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బుడ్డ పోశెట్టి, ఎడపల్లి ఉప సర్పంచ్‌ ఆకుల శ్రీనివాస్‌, నాయకులు పాల్గొని ఫూలే విగ్రహానికి నివాళులర్పించారు.నందిపేట్‌ మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో, శాపూర్‌ గ్రామంలో బహుజన సమాజ్‌పార్టీ ఆధ్వర్యంలో, వెల్మల్‌, కుద్వాన్‌పూర్‌ తదితర గ్రామాల్లో పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.

Advertisement
సంఘ సంస్కర్తకు ఘననివాళి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement