e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, April 13, 2021
Advertisement
Home నిజామాబాద్ రావమ్మా.. ధాన్యలక్ష్మీ…!

రావమ్మా.. ధాన్యలక్ష్మీ…!

రావమ్మా.. ధాన్యలక్ష్మీ…!
  • ఉమ్మడి జిల్లాలో వెల్లువెత్తనున్న ధాన్యం దిగుబడులు
  • సకాలంలో రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా ప్రణాళికలు
  • వానకాలంలో నిజామాబాద్‌లో 5.55 లక్షల మెట్రిక్‌ టన్నులు
  • కామారెడ్డిలో 3.70 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోళ్లు
  • యాసంగిలో పెరిగిన సాగు విస్తీర్ణంతో భారీగా ధాన్యం రాక
  • నిజామాబాద్‌లో 8లక్షలు, కామారెడ్డిలో 5లక్షలు మెట్రిక్‌ టన్నుల అంచనా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 7, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడే పరిస్థితి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కే అవకాశం లేకపోయేది. మార్కెట్‌ యార్డుల్లో వ్యాపారులు, ఇతర మధ్యవర్తులు రైతుల పేరిట ధాన్యాన్ని విక్రయించకుండానే గోల్‌మాల్‌ చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. ఊరూరా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. కొనుగోళ్లలో పారదర్శకత రెట్టింపు అయ్యింది. రైతుల ఆధార్‌ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకాలను అనుసంధానం చేసి వారి ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా ప్రభు త్వం ఏర్పాట్లు చేసింది. వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు రైతులు ధాన్యం తీసుకెళ్తే వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేసే పరిస్థితులకు కాలం చెల్లింది. పం డించిన ధాన్యానికి రైతులకు మద్దతు ధర దక్కేలా పౌరసరఫరాల సంస్థ ద్వారా పకడ్బందీ చర్యలు అమలవుతున్నాయి.

వానకాలం గడిచిందిలా…
వానకాలం 2020 సీజన్‌లో వరి పంట ఉత్పత్తులు ఊ రూరా వెల్లువెత్తాయి. సకాలంలో వానలు, కలిసి వచ్చిన వాతావరణంతో ఉత్పత్తి గణనీయంగా వచ్చింది. పంట చేతికొచ్చే సమయానికి అక్కడక్కడ పంట నష్టం సంభవించినప్పటికీ మొత్తంగా దిగుబడులు మాత్రం పెద్ద ఎత్తున రావడం విశేషం. పంటల విస్తీర్ణం పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి అప్రమత్తమై కొనుగోళ్లను ప్రశాంతంగా పూర్తి చేసింది. చేతికి పంట వచ్చే నాటి కి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని పకడ్బందీగా వ్యవహరించింది. 2020 సీజన్‌లో ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ధాన్యాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా యంత్రాంగాలు సకాలంలో పూర్తి చేశాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే కామారెడ్డి జిల్లాల్లో సంపూర్ణంగా వరి ధాన్యం సేకరణ పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. నిజామాబాద్‌ జిల్లాలో సమన్వయం లోపించడంతో ఆలస్యంగా కొనుగోళ్లు ముగిశాయి. నిజామాబాద్‌ జిల్లాలో వానకాలం 2020 సీజన్‌లో ధాన్యం సేకరణకు 445 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. 92,327 మంది రైతుల నుంచి రూ.1048 కోట్లు విలువ చేసే 5లక్షల 55వేల 382 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని యంత్రాంగం సేకరించింది. కామారెడ్డి జిల్లా లో 341 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,02,097 మం ది రైతుల నుంచి రూ.700.23 కోట్లు విలువ చేసే 3లక్షల 70వేల 946 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించడం గమనార్హం.

ఇంటింటా ధాన్యలక్ష్మీ…
యాసంగి సీజన్‌లో రైతులు తమకున్న వ్యవసాయ భూ మి అంతటిని సాగుకు వాడుకున్నారు. పంటలు పండించేందుకు సీఎం కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్పత్తులను గణనీయంగా రాబట్టారు. సర్కారు అందిస్తున్న సహాయ, సహకారాలను ఫలవంతం చేసుకున్నా రు. రైతుబంధుతో పెట్టుబడులకు చేయూత అందింది. గతం లో సీజన్‌కు సమయం ఆసన్నమవుతుండగా రైతు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. ఇప్పుడేకంగా రైతుబంధు రూపంలో ఎకరాకు రూ.5వేలు చొప్పున నగదు రావడంతో చింత లేకుండాపోయింది. దీంతో పాటుగా ఉచితంగా 24గంటల కరెంటు సరఫరా, కాలువల ద్వారా పంటలకు సాగు నీరు, అందుబాటులో వ్యవసాయ అధికారులు, సలహా లు, సూచనలు అందివ్వడానికి క్షణాల్లో వాలిపోయే శాస్త్రవేత్తలతో రైతులకు కొండంత అండ లభిస్తున్నది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట కు గిట్టుబాటు ధర కలిసి రావడం, కొనుగోలు కేంద్రాలూ విస్తారంగా ఏర్పాటు చేయడంతో అన్నదాతలు వ్యవసాయాన్ని పండుగలా మార్చుకుంటున్నారు. భిన్న పంటలతో పాటే వరిని అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3.89లక్షల ఎకరాల్లో వరి సాగవ్వగా 10.50 లక్ష లు మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనాలున్నాయి. ఇందులో సుమారుగా 3లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యం ప్రైవేటు కొనుగోళ్లకు వెళ్లినప్పటికీ ప్రభుత్వం దాదాపుగా 8లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కామారెడ్డి జిల్లాలో 2.33లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 5.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలున్నాయి. ప్ర భుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా దాదాపుగా 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించనున్నారు.

రైతుకు కొండంత ‘మద్దతు’
పెరిగిన సాగు నీటి వసతి మూలంగా సాగు విస్తీర్ణం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగింది. యాసంగిలో వానకాలం కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడంతో ఈసారి ధాన్యం భారీగా వస్తున్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ అప్రమత్తమై రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నా అన్నదాతలకు ఇబ్బందులు కలుగకూడదనే భావనతో సీఎం కేసీఆర్‌ ధాన్యం సేకరణకు మొగ్గు చూపారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని కొనడం, వెంటనే ట్యాబ్‌లలో వివరాలు నమోదు చేయడం, రైతు ఖాతాల్లో డబ్బులు వేయడం, సేకరించిన ధాన్యాన్ని గోదాములకు తరలించడం వంటివి యుద్ధప్రాతిపదికన జాప్యం లేకుండా పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. టాఉఆ్పలిన్లు, గన్నీ బ్యాగులు, ట్యాబ్‌లు, ధాన్యం రవాణాకు వాహనాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాగా… ధాన్యం సేకరణను ఒకట్రెండు రోజుల్లోనే షురూ చేయనున్నారు.

ఇవీ కూడా చదవండీ…

జవాన్‌ రాకేశ్వర్‌ విడుదలకు చర్చలు షురూ!

పంజాబ్‌లో నైట్ క‌ర్ఫ్యూ.. రాజ‌కీయ స‌మావేశాలు బ్యాన్‌

కోవిడ్‌తో ఎక్కువ‌వుతున్న డిప్రెష‌న్‌, మ‌తిమ‌రుపు కేసులు

Advertisement
రావమ్మా.. ధాన్యలక్ష్మీ…!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement