e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home జిల్లాలు ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

డీఆర్డీవో చందర్‌నాయక్‌
మోర్తాడ్‌/వేల్పూర్‌/ఏర్గట్ల/ముప్కాల్‌, జూన్‌ 7 : ప్రతి గ్రామంలో ఉపాధికూలీల సంఖ్యను పెంచాలని డీఆర్డీవో చందర్‌నాయక్‌ అ న్నారు. మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో కంపోస్ట్‌ షెడ్డు, నర్సరీలను సోమవారం పరిశీలించారు. అనంతరం మేట్లతో సమావేశంలో మాట్లాడారు. కూలీల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదని పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. వర్షాకాలం ఆరంభమవుతున్నందున నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలను నాటించేందుకు ప్ర ణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో శకుంతల, సర్పంచ్‌ గడ్డం చిన్నారెడ్డి, ఉపసర్పంచ్‌ నవీన్‌ ఉన్నారు. వేల్పూర్‌ మండల కేంద్రంలోని నర్సరీ, ఉపాధి హామీ పనులను డీఆర్డీవో పరిశీలించారు. మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీల్లో పండ్ల మొక్కలు ఎక్కువ మొత్తం లో పెంచడానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కూలీలు పనులు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ భీ మ జమున, సర్పంచ్‌ తీగల రాధ, ఉపసర్పంచ్‌ పిట్ల సత్యం, ఎంపీడీవో కరుణాకర్‌, ఏపీవో శ్రీనివాస్‌, కార్యదర్శి వినోద్‌ కుమార్‌,బోజేందర్‌, సుకేష్‌, శ్రీనివాస్‌, మహిపాల్‌ ఉన్నారు.
ఏర్గట్ల మండల కేంద్రంలోని నర్సరీని మండల అధికారులతో కలిసి డీఆర్డీవో పరిశీలించారు. ప్రతి ఒక్క మొక్కను సంరక్షించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి కల్పనా రుణంతో ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని ఐకేపీ ఆధికారులతో కలిసి ప్రారంభించారు. ఆయన వెంట ఎంపీడీవో కర్నె రాజేశ్‌, ఎంపీవో శివచరణ్‌, ఐకేపీ సీసీలు సంతోష్‌, నవీన్‌, వీవోలు, బీవోలు తదిరతులు పాల్గొన్నారు. ముప్కాల్‌ మండలంలోని రెంజర్ల గ్రామంలో ఐకేపీ ద్వారా పొందిన రుణంతో ఏర్పాటు చేసిన కిరాణ దుకాణాన్ని ఉప సర్పంచ్‌ మోహన్‌రెడ్డి సో మవారం ప్రారంభించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలి

ట్రెండింగ్‌

Advertisement