e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home నిజామాబాద్ సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు

సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు

  • రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి
సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు

నిజామాబాద్‌ రూరల్‌/ఖలీల్‌వాడి, జూన్‌ 15: సీ ఎంఆర్‌ఎఫ్‌తో పేదలకు మెరుగైన వైద్యం అందుతున్నదని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. రూరల్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఐదుగురికి ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను రూరల్‌ ఎమ్మెల్యే తన నివాసంలో మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీ సీ అంకల గంగాధర్‌, సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, సొసైటీ చైర్మన్‌ దాసరి శ్రీధర్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బొల్లెంక గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోపాల్‌కు చెందిన యాదవసంఘం జిల్లా అధ్యక్షురాలు మంజులాయాదవ్‌కు రూ.లక్ష మంజూ రుకాగా, ఎమ్మెల్యే ఆమెకు చెక్కును అందజేశారు.

నిరు పేదలకు అండ..
నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తున్నదని డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బురకల సుకన్య కమలాకర్‌, జడ్పీటీసీ తలారి గంగాధర్‌, వైస్‌ ఎంపీపీ సరస్వతీ రవిగౌడ్‌, సావెల్‌ సొసైటీ చైర్మన్‌ మచ్చర్ల రాజారెడ్డి, సర్పంచులు సామ గంగారెడ్డి, మచ్చర్ల రాజారెడ్డి, గోపిడి గం గారెడ్డి, వరిగడ్డి రవి, పసుల శ్రీనివాస్‌, దేవన్న తదితరులున్నారు. భీమ్‌గల్‌ మండలంలోని చేంగల్‌, బడా భీమ్‌గల్‌, గోన్‌గొప్పుల గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను ఎంపీపీ మహేశ్‌, జడ్పీటీసీ చౌట్‌పల్లి రవితో కలిసి పంపిణీ చేశారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, వైస్‌ ఎంపీపీ దావిదు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మనాయక్‌, భీమ్‌గల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ శోభన్‌, సర్పంచులు గంగారెడ్డి, సంజీవ్‌, అనసూయ, నాయకులు పాల్గొన్నారు. కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్‌కు చెందిన డబ్బ నారాయణ, కుమ్మరి రాజన్నకు మంజూరైన చెక్కులను బషీరాబాద్‌ సర్పంచ్‌ సక్కారం అశోక్‌, ఉప సర్పంచ్‌ విక్రమ్‌ పంపిణీ చేశారు. రుద్రూర్‌లోని రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో నలుగురికి షాదీ ముబారక్‌, ఏడుగురికి కల్యాణలక్ష్మి, ఆరుగురికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను జడ్పీటీసీ నారోజి గంగారాం పంపిణీ చేశారు. ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్‌, ఏఎంసీ చైర్మన్‌ సంజీవ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పత్తి లక్ష్మణ్‌, ఆర్‌ఐ భారతి, కో-ఆప్షన్‌ సభ్యుడు మస్తాన్‌, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఖాదర్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సంగయ్య, విండో చైర్మన్‌ సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని కల్లూర్‌ గ్రామంలో ముగ్గురికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు సిరాజ్‌ అందజేశారు. నాయకులు వోలే లింగప్ప, రాంరెడ్డి, కార్యదర్శి ప్రతాప్‌, సాయిలు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు
సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు
సీఎంఆర్‌ఎఫ్‌తో మెరుగైన వైద్యసేవలు

ట్రెండింగ్‌

Advertisement