e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home నిజామాబాద్ ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం

  • రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌
ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం

సిరికొండ, జూన్‌ 12: టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మండలంలోని ముషీర్‌నగర్‌ గ్రామానికి చెందిన కేతావత్‌ పంతులు ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కును శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న వారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే పార్టీ రూ. రెండు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఎంపీపీ మలావత్‌ సంగీత, వైస్‌ ఎంపీపీ తోట రాజన్న, సిరికొండ సర్పంచ్‌ ఎన్నం రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ మైలరామ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
జక్రాన్‌పల్లి, జూన్‌ 12: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి ఆర్థిక సా యం మంజూరు కాగా, సంబంధించిన చెక్కులను రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ బాధితులకు శనివారం అందజేశారు. చింతలూర్‌ గ్రామానికి చెందిన నాగుల రాజేశ్వర్‌కు రూ. 60 వేలు, నా గుల రాజుబాయికి రూ. 32 వేలు, మునిపల్లి గ్రామానికి చెందిన మనీశ్‌కు రూ.60 వేలు, లక్ష్మాపూర్‌ గ్రా మానికి చెందిన చాంగ్‌ బాయికి రూ. 35 వేలు, గూండ్ల ముత్తెన్నకు రూ. 13 వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ ‘నేను ఉన్నాను’ అంటూ ఆర్థికంగా ఆదుకుంటూ నిధులు మంజూరు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ డీకొండ హరిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు డీకొండ శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ అనంత్‌రెడ్డి, చింతలూర్‌ సర్పంచ్‌ సుకన్య, ఎంపీటీసీ జయ పాల్గొన్నారు.

- Advertisement -

రూరల్‌ మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి
నిజామాబాద్‌ రూరల్‌, జూన్‌ 12 : మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎంపీడీవో మల్లేశ్‌కు సూచించారు.
నిజామాబాద్‌ రూరల్‌ ఎంపీడీవో మల్లేశ్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వం మంజూరు చేసిన ఇతర అభివృద్ధి పనుల గురించి ఎంపీడీవో ఎమ్మెల్యేకు వివరించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం
ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం
ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ట్రెండింగ్‌

Advertisement