మాక్లూర్: సమస్యలు పరిష్కరించి, వసతులు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డికి మాక్లూర్ మండల పరిధిలోని 2వ డివిజన్‌కు చెందిన మానిక్‌బండార్ తండావాసులువిన్నవించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలో రేషన్ దుకాణం లేదని చెప్పారు. దీంతో దూరప్రాంతాకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని తెలిపారు. అంతేగాకుండా విద్యుత్ సమస్య ఉందని, రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు. తండాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. తప్పకుండా నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే వారికి హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు, తండా పెద్దలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.