ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 6 : జర్మనీలో నివాసం ఉంటున్న మన దేశానికి చెందిన దంపతులు ఐదు సంవత్సరాల పాపను దత్తత తీసుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పాపను వారికి అప్పగించి అవసరమైన పత్రాలు వారికి అందజేశారు.
ఇంటర్ కంట్రీ ఆడాప్షన్లో భాగంగా శిశుగృహలోని సన్వితను దత్తత ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా దంపతులను కలెక్టర్ అభినందించారు. పాపను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా సంక్షేమాధికారిణి సుధారాణి, బాల రక్షాభవన్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య కుమార్, శిశు గృహ మేనేజర్ అనిత, సిబ్బంది పాల్గొన్నారు.