e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home కామారెడ్డి ఆగని వాన

ఆగని వాన

ఆగని వాన

రెండు రోజులుగా కురుస్తున్న వర్షం
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
మత్తడి దుంకుతున్న చెరువులు
ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
కౌలాస్‌నాలా మూడుగేట్ల ఎత్తివేత

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 21: ఉమ్మడి జిల్లాలో బుధవారం రోజంతా వాన కురిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో రావడంతో జలకళ సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆక్కడ నివసిస్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలకు ధర్పల్లి మండలంలోని మైలారంలో ఓ ఇల్లు కూలిపోయింది. డిచ్‌పల్లి మండలంలోని సుద్దపల్లి చెక్‌డ్యాం, వేల్పూర్‌ మండలంలోని కప్పలవాగు, పెద్దవాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. కమ్మర్‌పల్లి మండలంలోని గట్టు పొడిచిన వాగు, రాళ్లవాగు ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్నాయి. కామారెడ్డి జిల్లా సరాసరి వర్షపాతం 38.6 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 84 మి.మీ., అత్యల్పంగా జుక్కల్‌ మండలంలో 12.8 మి.మీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా వేల్పూర్‌ మండలంలో 70 మి. మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా రెంజల్‌ మండలంలో 20.4 మి.మీటర్ల వర్షం కురిసింది.

ఎస్సారెస్పీకి 29,595 క్యూసెక్కుల వరద
పరిసరాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి 29,595 కూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాలేగావ్‌ ప్రాజెక్టుల నుంచి మిగులు జలాలను విడుదల చేశారని, బాలేగావ్‌నుంచి వరద గురువారం ఉదయం వరకు ఎస్సారెస్పీకి చేరుకుంటుందని పేర్కొన్నారు. పంటల కోసం కాకతీయ కాలువకు 50, లక్ష్మి కాలువకు 60 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1087.30 అడుగుల (74.186 టీఎంసీలు) నీటినిల్వ ఉందన్నారు. ఈ సీజన్‌లో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి 58 టీఎంసీల వరద వచ్చి చేరిందని ఏఈఈ తెలిపారు.

- Advertisement -

పొంగిపోర్లుతున్న సింగీతం, నల్లవాగు
నిజాంసాగర్‌ మండలంలోని నల్లవాగు, సింగీతం, కళ్యాణి ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. బుధవారం సాయంత్రానికి సింగీతం ప్రాజెక్టు 416.550 మీటర్లతో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు అడ్డుగోడ పైనుంచి నీరు మంజీరలోకి ప్రవహిస్తున్నాయి. వరద అధికంగా వస్తే నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తామని ఏఈ శివకుమార్‌ తెలిపారు.
పోచారంలోకి 2,805 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
నాగిరెడ్డిపేట్‌ మండలంలోని పోచారం ప్రాజెకులోకి 2,805 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నదని ఇరిగేషన్‌ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 15 అడుగుల మేర నీటి మట్టం ఉందని పేర్కొన్నారు.

కౌలాస్‌నాలా ప్రాజెక్టు మూడు వరదగేట్ల ఎత్తివేత
జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్టుకు 917 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో మూడు వరదగేట్ల ద్వారా 852 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు (1.23 టీఎంసీలు) కాగా, 457.85 మీటర్ల(1.200 టీఎంసీలు) నీరుందని డీఈఈ దత్తాద్రి తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆగని వాన
ఆగని వాన
ఆగని వాన

ట్రెండింగ్‌

Advertisement