టాలీవుడ్ లో సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ పుష్ప. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఈ మూవీలో అందాల భామ అనసూయ భరద్వాజ్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం షూటింగ్ రీస్టార్ట్ అవగా..తాజా షెడ్యూల్ లో అనసూయ జాయిన్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న పుష్ప ప్రాజెక్టులో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. మలయాళ స్టార్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ పోషిస్తున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. రంగస్థలం లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుకుమార్ తో మరోసారి ఈ సినిమా చేస్తుండటం ఎక్జయిటింగ్ గా ఉందని తెలిపింది అనసూయ.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్