పేదల పక్షపాతి సీఎం కేసీఆర్

- రాష్ర్టాభివృద్ధికి నిరంతర కృషి
- బీజేపీ నేతలు అసత్య ప్రచారాలను మానుకోవాలి
- నిజాంసాగర్ మండలం మహ్మద్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
నిజాంసాగర్, ఫిబ్రవరి 22: పేదల సంక్షేమమే లక్ష్యం గా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మహ్మద్‌నగర్ గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనం, రైతువేదికను జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభతో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.60 లక్షలతో చేపట్టనున్న కల్యాణ మం డప నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లు త్వరలో నిజాంసాగర్‌కు చేరుతాయని, దీంతో ఆయకట్టు సస్యశ్యామలం కానున్నదని అన్నారు. కాళేశ్వరం నీటితో జుక్కల్ ప్రాంతాన్ని సైతం సస్య శ్యామలం చేసేందుకు ఇటీవల సీఎం కేసీఆర్ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం రూ.475 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నిజాంసాగర్‌కు 400 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలతో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుతున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని, రైతులకు ఉచితంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. 21 రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అక్కడి ప్రజలకు చేసేందేమీ లేదన్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మిలాంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కు లేదన్నారు.
ఐదు వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు మంజూరుచేస్తా..
జుక్కల్ నియోజకవర్గానికి త్వరలో ఐదు వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తానని మంత్రి ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందన్నారు. మహ్మద్‌నగర్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. గతం లో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు దఫేదార్ రాజు ఉమ్మడి జడ్పీ చైర్మన్‌గా పనిచేశారని, ప్రస్తుతం కామారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఆయన సతీమణి దఫేదార్ శోభ ఉన్నారన్నారు. ఇద్దరు జడ్పీ చై ర్మన్లను అందించిన ఘనత మహ్మద్నగర్కే దక్కిందన్నారు.
రూ.8 కోట్ల రైతు పెట్టుబడి మంజూరు: ఎమ్మెల్యే షిండే
జుక్కల్ నియోజకవర్గంలో 10,700 మంది రైతులకు ప్రభుత్వం ఈ సీజన్‌కు రూ.8 కోట్లు రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమ చేసిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే తెలిపారు. ప్రతి కుటుంబానికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. నాగమడుగు పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని అన్నారు.
రైతు సంక్షేమమే సర్కారు లక్ష్యం: జడ్పీ చైర్పర్సన్ శోభ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ అన్నారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించిందని తెలిపారు. భవిష్యత్తులో ఈ వేదికల ద్వారా రైతులకు అధిక దిగుబడులు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగించనుందని చెప్పారు. రైతులు లాభదాయకమైన పంటలు పండించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీ పీ పట్లోల్ల జ్యోతిదుర్గారెడ్డి, సర్పంచ్ బాలమణి, సొసైటీ చైర్మన్ వాజిద్, ఆర్డీవో రాజాగౌడ్, నాయకులు దుర్గారెడ్డి, విఠల్, గంగారెడ్డి, రమేశ్‌గౌడ్, సత్యనారాయణ, మనోహర్, మోహన్‌రెడ్డి, నర్సింహారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ వెలిగిస్తే రూ. 1000 జరిమానా
- అమెరికా వైమానిక దాడిలో 17 మంది మిలిటెంట్లు మృతి
- దేశంలో కొత్తగా 16,577 కొవిడ్ కేసులు
- బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిన ప్రియా ప్రకాశ్.. !
- 100 జిలటిన్ స్టిక్స్.. 350 డిటోనేటర్లు స్వాధీనం
- ప్రముఖ తెలుగు రచయిత్రి పెయ్యేటి దేవి ఇకలేరు
- మార్చి 4 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐదో దశ పరీక్షలు
- నేడు ఎంజీఆర్ మెడికల్ వర్సిటీ స్నాతకోత్సవం.. ప్రసంగించనున్న ప్రధాని
- 60 వేల నాణెలతో అయోధ్య రామాలయం
- నానీని హగ్ చేసుకున్న ఈ బ్యూటీ మరెవరో కాదు..!