ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 27, 2021 , 00:46:14

ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే సహించం

ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తే సహించం

 బీజేపీకి టీఆర్‌ఎస్‌ నాయకుల హెచ్చరిక

డిచ్‌పల్లి, జనవరి 26: మచ్చలేని నాయకురాలైన  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విమర్శిస్తే సహించేదిలేదని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ హెచ్చరించారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ హోదాలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కవితను విమర్శించే స్థాయి జిల్లాలో ఎవరికీ లేదన్నారు. సంబంధం లేని విషయాల్లో కవిత పేరును ప్రస్తావించడం సిగ్గుచేటన్నారు. యానంపల్లి, కమలాపూర్‌ గ్రామాల్లో బీజేపీ నాయకుల ఆగడాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇకనైనా అసత్యప్రకటనలను మానుకోనిపక్షంలో నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు లక్ష్మీనర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఒడ్డెం నర్సయ్య, విండో చైర్మన్‌ గజవాడ జైపాల్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు నయీం, నా యకులు పద్మారావు, చాకలి సాయిలు, గోపు చిన్న న్న, గుడాల లింగం, తాండ్ర అంజయ్య, లాయక్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo