శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 27, 2021 , 00:46:13

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 26: 

జిల్లా వ్యాప్తంగా గణతం త్ర దినోత్సవ వేడుకలను కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మంగళవారం సాదాసీదాగా నిర్వహించా రు. తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం, రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎన్‌వీ సత్యశ్రీనివా స్‌, జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఆవరణలో డీఈ వో ఎన్‌వీ దుర్గాప్రసాద్‌ జాతీయజెండాను ఎగురవేశారు. బెటాలియన్‌లో నిర్వహించిన వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరైన బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ అడ్వైజర్‌, చీఫ్‌ కోచ్‌ బ్యాడ్మింటన్‌, ద్రోణాచార్య అవార్డు గ్రహీత గంగూలీప్రసాద్‌ విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన  అధికారులకు, సిబ్బందికి కమాండెంట్‌తో కలిసి ప్రశంసాపత్రాలను అందజేశారు. బోధన్‌ పట్టణంలోని క్యాంపు కార్యాలయం, వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే షకీల్‌ జెండాను ఎగురవేశారు. 

జిల్లా కేంద్రంలోని  జడ్పీ కార్యాలయ ఆవరణలో సీఈవో గోవింద్‌, చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ రజిత పాల్గొన్నారు. నిజామాబాద్‌ కార్పొరేషన్‌, నుడా కార్యాలయ ఆవరణలో కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌ మున్సిపల్‌ కార్యాలయాల్లో చైర్‌పర్సన్లు, పండిత్‌ వినిత, మల్లెల రాజశ్రీ, తూము పద్మావతి,  డీఐజీ రేంజ్‌ కార్యాలయంలో అదనపు డీసీపీ అరవింద్‌బాబు, ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ ఇందిర జాతీయ జెండాలను ఎగురవేశారు. టీఆర్‌ఎస్‌ కార్యాలయం లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అవంతిరావు, ఐడీసీ ఎంస్‌ఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ సాంబారి మోహ న్‌, కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ కార్యాలయాల్లో పార్టీల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. రెడ్‌క్రాస్‌, ఐఎంఏ, దేవాదాయశాఖ, స్నేహసొసైటీ కార్యాలయాల్లో జెండాలను ఎగురవేశారు.

 జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. 

పరేడ్‌గ్రౌండ్‌లో..

ఇందూరు, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం వేదికపై మిషన్‌భగీరథ బాటిళ్లను ప్రదర్శించారు.  కలెక్టర్‌ నారాయణరెడ్డి బాటిళ్లలోని నీటిని తాగి ఎంతో స్వచ్ఛంగా ఉన్నాయన్నారు. బాటిళ్లలో ‘భగీరథ’ నీటిని సరఫరా చేయడం గొప్పవిషయమన్నారు. సాంస్కృతిక కళాకారుల పాటలు, పోలీసు కళాబృందం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయాశాఖల ప్రగతి, సేవలను కళ్లకు కట్టేలా శకటాలను ప్రదర్శించారు. 

వైద్యారోగ్యశాఖ శకటానికి మొదటి, ప్రభు త్వ దవాఖాన శకటానికి రెండో, మున్సిపల్‌ శకటానికి మూడో బహుమతి లభించింది.

VIDEOS

logo