సోమవారం 08 మార్చి 2021
Nizamabad - Jan 24, 2021 , 00:53:38

రామాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం

రామాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం

ఆర్మూర్‌, జనవరి 23 : అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి రూ.5,01,011 విరాళాన్ని అందజేశారు. ఆర్మూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో కలిసి రామాలయ ట్రస్ట్‌ ప్రతినిధులకు శనివారం చెక్కును అందజేశారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పిలుపు మేరకు విరాళం అందజేశానని, నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు విరాళాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీలు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్‌, వాకిడి సంతోష్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మెట్టు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo