‘పసుపు పంటకు మద్దతు ధర చెల్లించాలి’
_1611341067.jpg)
ఆర్మూర్, జనవరి 22: పసుపు పంటకు క్వింటాలు కు రూ.15వేలు చెల్లించాలని అఖిలపక్ష నాయకులు ప్రభాకర్, మునిపల్లి సాయారెడ్డి, యాదాగౌడ్, లింగారెడ్డి అన్నారు. ఆర్మూర్‌లోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో అఖిలపక్ష నాయకులు శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడారు. పసుపు బోర్డును త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రైతు ప్రతినిధులు, రైతు ఐక్యకార్యాచరణ నాయకులు పాల్గొన్నారు.
‘కేంద్రం మెడలు వంచుతాం’
కేంద్రం మెడలు వంచైనా పసుపు పంటకు ప్రత్యేక బోర్డును తెచ్చుకుందామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. పసుపు రైతులకు అండగా నిలిచేందుకు ఈనెల 30వ తేదీన ఆర్మూర్‌లో రేవంత్‌రెడ్డి ఒకరోజు దీక్ష చేపట్టనున్నారని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరాలు గడిచినా పసుపు బోర్డు రాలేదని ఎంపీ తన అర్వింద్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి, అర్బన్ ఇన్చార్జి తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ కార్యదర్శి నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎంపీ నంద్‌కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్‌స్టాలో జాన్ అబ్రహం షర్ట్‌లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్‌బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలకు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు
- పోర్ట్ ప్రాజెక్టుల కోసం ఆరు లక్షల కోట్లు పెట్టుబడి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
- రోహిత్ శర్మ పోస్ట్..సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్
- కాంగ్రెస్‌లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్‌శర్మ vs అధిర్ రంజన్