నాలుగు రోజుల్లో 7082 మందికి టీకా

ఖలీల్‌వాడి /విద్యానగర్, జనవరి 19 : ఉమ్మడి జిల్లాలో గురువారం 1747 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. మొత్తం 64 కేంద్రాల్లో 2650 మందికి టీకా వేశారు. నిజామాబాద్ జిల్లాలోని 43 కేంద్రాల్లో 1747 మందికి, కామారెడ్డి జిల్లాలో 21 కేంద్రాల్లో 903 మందికి వ్యాక్సిన్ వేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాక్సినేషన్ పూర్తి చేశారు.ముందస్తు జాగ్రత్తగా యాంటీ వైరస్ మందులు, అత్యవసరం కోసం అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 4130 మందికి టీకా వేసినట్లు వైద్యారోగ్య శాఖ అధికారి సుదర్శనం తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2952 మందికి వ్యాక్సిన్ వేసినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రాల పనితీరును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్న ఏఎన్ఎం రిక్క మీన వాంతులు చేసుకున్నది. వైద్యులు ఆమెను పరిశీలించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆమెను జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ అశోక్ తెలిపారు.
నిజామాబాద్‌లో..
నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో 200 మందికి, బోధన్‌లో 40, ఆర్మూర్ కేం ద్రంలో 6, డిచ్‌పల్లిలో 21, మాక్లూర్‌లో 7, ఇందల్వాయిలో 50, అర్సపల్లిలో 11, పోతంగల్లో 43, భీమ్‌గల్‌లో 50, జక్రాన్‌పల్లిలో 55, చౌట్పల్లిలో 16, దేగాంలో 81, ధర్పల్లిలో 22, కమ్మర్‌పల్లిలో 46, కిసాన్‌నగర్‌లో 53, మోస్రాలో 83, ము దక్పల్లిలో 60, నందిపేట్‌లో 80, నవీపేట్లో 58, రెంజల్లో 46, సాలూరలో 80, సిరికొండలో 57, వేల్పూర్‌లో 24, ఎడపల్లిలో 32, చంద్రశేఖర్ కాలనీలో 22, దుబ్బలో 50, గౌతంనగర్‌లో 55, కల్లెడిలో 69, మాలపల్లిలో 36, మెండోరాలో 51, పాన్‌గల్లీలో 55, పోచంపాడ్‌లో 43, సీతారాంనగర్‌లో 59, వినాయక్‌నగర్‌లో 40, రుద్రూర్ కేంద్రంలో 46 మందికి టీకా వేశారు.
తాజావార్తలు
- కిడ్నాప్.. 6 గంటల్లో ఛేదించారు
- వాణి వినిపించాలంటే.. విద్యావేత్తకే పట్టం కట్టాలె..
- పదపద.. ప్రచారానికి..
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్‌షాపు