సేవల్లో ప్రథమం

బాన్సువాడ రూరల్, జనవరి 21 : బాన్సువాడ ఏరియా దవాఖానలో అందుతున్న నాణ్యమైన వైద్య సేవలతో కార్పొరేట్ దవాఖానను తలపిస్తున్నది. అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉండడంతో దవాఖానకు వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ మహిళలకు నాణ్యమై ప్రసూతి వైద్యం అందడంతో డివిజన్లోని వివిధ మండలాలకు చెందిన గర్భిణులు ప్రసవాల కోసం ఏరియా దవాఖానకు వస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ప్రసవాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది 3120 ప్రసవాలు జరిగాయి. దీంతో బాన్సువాడ ఏరియా దవాఖాన సుఖ ప్రసవాలకు నిలయంగా మారింది. అత్యాధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. దవాఖానలో 24 గంటల పాటు అందుబాటులో వైద్యులు ఉండడం, అన్ని వసతులు కలిగిన ఆపరేషన్ థియేటర్, బ్లడ్‌బ్యాంకు, శిశువుల కోసం అత్యాధునిక చిల్డ్రన్స్వార్డు (ఎన్‌బీఎస్‌యూ) అందుబాటులో ఉన్నాయి.
సేవలకు గుర్తింపు..
రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు దవాఖానను పరిశుభ్రంగా ఉంచుతూ కార్పొరేట్ దవాఖానలకు దీటుగా సేవలందిస్తున్న దవాఖానగా బాన్సువాడ ఏరియా వైద్యశాల పేరొందింది. 2019 -2020 సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఉన్న సదుపాయాలు, పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్ నిర్వహణ వంటి ఏడు అంశాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి రాష్ట్రంలోనే ఉత్తమ ఏరియా దవాఖానగా నిలిచి కాయకల్ప అవార్డును సొంతం చేసుకున్నది. ఇందులో భాగంగా రూ.20 లక్షల ప్రోత్సాహకం అందుకోనున్నది. 2017 - 2018లో రెండో స్థానం, 2018 -2019లో మొదటి స్థానం, 2019 -2020లో మొదటి స్థానం సాధించి రాష్ట్రంలోనే అరుదైన గుర్తింపును దక్కించుకుంది.
సిబ్బంది సహకారంతోనే..
రోగులకు అత్యుత్తమ సేవలు అందించి మొదటి స్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉంది. దవాఖానలోని సిబ్బంది సమష్టిగా పని చేయడంతో ఈ ఘనత సాధించగలిగాము. రోగులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ వారికి నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. కాయకల్ప అవార్డు సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి కృతజ్ఞతలు.
-డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సూపరింటెండెంట్
తాజావార్తలు
- ఆజాద్ దిష్టిబొమ్మ దగ్దం చేసిన కాంగ్రెస్ వర్కర్లు
- ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
- స్టన్నింగ్ లుక్‌లో నాగార్జున.. పిక్ వైరల్
- ఆస్ట్రేలియాలో బస్‌డ్రైవర్‌గా మారిన శ్రీలంక క్రికెటర్
- కూలీలతో కలిసి ప్రియాంక తేయాకు సేకరణ..వీడియో
- ధర్మపురిలో ‘సంకష్ట చతుర్థి’ పూజలు
- టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా
- మాల్దీవులలో బిపాసా అందాల ఆరబోత మాములుగా లేదు..!
- అసోం, అండమాన్‌లో కంపించిన భూమి
- ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ బుమ్రా దూరం!