సోమవారం 01 మార్చి 2021
Nizamabad - Jan 21, 2021 , 00:53:34

రెండేండ్లకు తల్లి చెంతకు..

రెండేండ్లకు తల్లి చెంతకు..

కనబడకుండా పోయిన బిడ్డకోసం ఏకధారగా ఏడ్చిన ఆ కన్నపేగుకు రెండేండ్లకు దుఃఖం తీరింది. తప్పిపోయిన బిడ్డ తిరిగి ఒడికి చేరడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రెండేండ్ల క్రితం గుంటూరు నుంచి తప్పిపోయిన ఎనిమిదేండ్ల బాలుడు బోధన్‌కు చేరాడు. సోషల్‌ మీడియా పుణ్యమా.. అని తన బిడ్డ ఇక్కడ ఉన్నాడని తెలుసుకున్న తల్లి బుధవారం బోధన్‌కు చేరుకుంది. అధికారుల సమక్షంలో చాంద్‌పాషా అనే వ్యక్తి కొడుకును తల్లికి అప్పగించారు. 

శక్కర్‌నగర్‌: రెండేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లినపోయిన బాలుడు తల్లి చెంతకు చేరాడు. గుంటూరు జిల్లా అచ్చంపేట్‌ మండల కేంద్రానికి చెందిన పాలపర్తి మగ్‌లాలి-శ్రీనివాస్‌ దంపతుల కుమారుడు సాలమన్‌రాజ్‌ రెండేండ్ల క్రితం గుంటూరు నుంచి నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. బోధన్‌లోని గోశాల ప్రాంతానికి చెందిన చాంద్‌పాషాకు ఈ బాలుడు బస్టాండ్‌ ప్రాంతంలో కనిపించాడు. బాలుడి వివరాలు అడిగినా సరిగా చెప్పలేదు. దీంతో బాలుడి వివరాల కోసం పలుమార్లు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లో పోస్ట్‌ చేశాడు. బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లి బుధవారం బోధన్‌ పట్టణానికి చేరుకున్నది. స్థానిక శ్రీసాయి ఆదర్శ యువతి మహిళా మండలి అధ్యక్షురాలు టి. పద్మాసింగ్‌, అంగన్‌వాడీ కార్యకర్త పుష్ప ద్వారా చాంద్‌పాషా ఇంటికి చేరుకున్నారు. బాలుడు కూడా తన తల్లిని గుర్తుపట్టడంతో పోలీసుల సమక్షంలో తల్లికి అప్పగించారు. రెండేండ్ల అనంతరం కుమారుడు దొరకడంపై తల్లి ఆనందం వ్యక్తం చేసింది.

VIDEOS

logo