శనివారం 27 ఫిబ్రవరి 2021
Nizamabad - Jan 17, 2021 , 00:09:17

నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితకు వినతి

నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితకు వినతి

శక్కర్‌నగర్‌, జనవరి 16: బోధన్‌ పట్టణంలోని గీత కార్మిక సహకార సంఘం నాయకులు, డిపో డైరెక్టర్లు శనివారం ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బోధన్‌లో గీత కార్మిక భవన నిర్మాణం కోసం రూ. 25లక్షల నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో  గీత కార్మిక సహకార సంఘం అధ్యక్షుడు పిల్లకుంట్ల గంగాధర్‌ గౌడ్‌, సభ్యులు పి. సిద్ధిరామా గౌడ్‌, చిన్న హన్మాగౌడ్‌, వుల్లంగి రవిగౌడ్‌, డి. బాల్‌రాజ్‌, ఎస్‌. చంద్రాగౌడ్‌, సీహెచ్‌. సాయాగౌడ్‌, ఎం.శంకర్‌ గౌడ్‌, శ్రీధర్‌ గౌడ్‌, యువజన నాయకులు శంకర్‌ గౌడ్‌, సంతోష్‌ గౌడ్‌, జనార్దన్‌ గౌడ్‌ ఉన్నారు.


VIDEOS

logo