శనివారం 06 మార్చి 2021
Nizamabad - Jan 16, 2021 , 02:44:52

ఎస్సైల బదిలీ

ఎస్సైల బదిలీ

  • ఉమ్మడి జిల్లాలో17 మందికి స్థానచలనం 
  • ఉత్తర్వులు జారీ చేసినరేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి 
  • వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం  
  • ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీ

నిజామాబాద్‌ సిటీ, జనవరి 15 : నిజామాబాద్‌ రేంజ్‌ పరిధిలోని నిజామాబాద్‌, సిద్దిపేట కమిషనరేట్లు, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ నిజామాబాద్‌ రేంజ్‌ డీఐజీ శివశంకర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 17మందికి స్థానచలనం కలుగగా.. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌, కామారెడ్డి జిల్లాకు చెందిన 15 మంది ఎస్సైలు ఉన్నారు. తమకు కేటాయించిన స్థానాల్లో వెంటనే చార్జి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


VIDEOS

logo