సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Jan 13, 2021 , 00:43:50

అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేత

అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేత

ఖలీల్‌వాడి, జనవరి 12 :  నగరంలోని అర్బన్‌ హెల్త్‌ ఇంజినీర్‌ కార్యాలయ స్థలాన్ని ఆక్రమించి ఓ వ్యక్తి కట్టిన గోడను మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఈ క్రమంలో స్థానికులకు, అధికారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. టౌన్‌ప్లానింగ్‌ అధికారి వెంటేశం, ఇంజినీరింగ్‌ విభాగం అధికారి నగేశ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జ్జాచేసి నిర్మించిన గోడను తొలగించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారని తెలిపారు. 


logo