స్వామి వివేకానందుడికి ఘన నివాళి

నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతిని జిల్లాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాజుల్‌పేట్‌లో మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు, నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు, జేసీఐ ఇందూరు సభ్యులు తదితరులు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐఎంఏ హాలులో కార్యవర్గసభ్యులు వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సహారా ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్ భవనంలో రక్తదానం చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో వివేకానందుడికి నివాళులు అర్పించారు. రాంపూర్‌లో 2006-07 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్పల్లి ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, సీఐ ప్రశాంత్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లిలో పర్ఫెక్ట్ యూత్ ఆధ్వర్యంలో, నిజామాబాద్ రూరల్ మండలంలోని కొండూర్, మల్లారం, కాలూర్, పాల్ద, కొత్తపేట్ తదితర గ్రామా ల్లో యువజన సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో వివేకానందుని విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గన్నారంలో ముదిరాజ్ యంగ్ స్టార్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డిపల్లిలో యువతులకు పులి సాగర్ అనే వ్యక్తి కుట్టు మిషన్లు అందజేశారు. ఇందల్వాయిలో స్పోర్ట్స్యూత్ ఆధ్వర్యంలో స్వామివివేకానంద విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సిరికొండలోని ప్రతిభ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించగా, ధర్పల్లి జడ్పీటీసీ జగన్ విజేతలకు బహుమతులు అందజేశారు. కోటగిరిలోని ప్రభుత్వ దవాఖానలో వివేకానంద హై స్కూల్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చందూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్ పట్టణంతోపాటు ఆయా గ్రామాల్లో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌లో బీజేపీ నాయకులు, మచ్చర్ల, సుర్బిర్యాల్, మగ్గిడిలో యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. బోధన్ పట్టణంలోని వివేకానందుని విగ్రహానికి ఎమ్మెల్యే షకీల్, మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి నివాళులు అర్పించారు. మండలంలో ని ఊట్పల్లి, అమ్దాపూర్ గ్రామాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు పోశెట్టి ఆధ్వర్యంలో, రెంజల్, భీమ్‌గల్ మండలాల్లో నాయకు లు, యువత ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో, ఎడపల్లి, మంగళ్‌పాడ్ గ్రామాల్లో వివేకానందునికి ఘన నివాళులు అర్పించారు. బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్ ఉన్నత పాఠశాలలోని వివేకానంద విగ్రహానికి ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో యువజన సమాఖ్య ఆధ్వర్యంలో వివేకానందునికి నివాళులర్పించారు. చౌట్పల్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నందిపేట్‌లో, మాక్లూర్‌లో వివేకానంద జయంతిని యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
తాజావార్తలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ
- 15 గంటలపాటు సాగిన భారత్-చైనా మిలటరీ చర్చలు