సమాన పని...సమాన బాధ్యత...!

జల వనరుల శాఖ పునర్విభజనతో మేలు
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు అత్యుత్తమ మార్గం
ఉద్యోగులందరికీ అన్ని రకాల పనుల అప్పగింతకు అవకాశం
నిజామాబాద్ సీఈ పరిధిలో 4లక్షల 97వేల ఎకరాల ఆయకట్టు
ఎత్తిపోతల పథకాల ద్వారా క్రమపద్ధతిలో సాగు నీటి విడుదలకు చర్యలు
‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆర్.మధుసూదన్ రావు
నిజామాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నీటి పారుదల శాఖలన్నీ అ ధికారికంగా ఒకే గొడుగు కిందకు వచ్చాయి. భారీ, మధ్య, చిన్న తరహా విభాగాలతోపా టు ఎత్తిపోతల పథకాలు(ఐడీసీ) కలిపి జలవనరుల శాఖగా రూపాంతరం చెందింది. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల శా ఖలతోపాటు ఎత్తిపోతల పథకాల కార్యాలయాన్ని ఒకే పరిధిలోకి తీసుకొచ్చారు. స మూల మార్పుల తర్వాత జలవనరుల శాఖ కార్యకలాపాలకు అంకురార్పణ జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు కీలకంగా ఉన్న డివిజన్లలో మార్పులు, చేర్పుల తర్వాత ఉమ్మడి జిల్లాకు ఇద్దరు చీఫ్ ఇంజినీర్లు వచ్చారు. నిజామాబాద్ సీఈగా గోదావరి బేసిన్ కమిషనర్‌గా పని చేసిన ఆర్.మధుసూదన్ రావు నియమితులయ్యారు. 2021 కొత్త సంవత్సరం ఆరంభం నుంచే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాగు నీటి లెక్కలను పక్కాగా ఆరా తీస్తున్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో సీఈ పలు విషయాలు పంచుకున్నారు.
నమస్తే తెలంగాణ : పాత ఉమ్మడి జిల్లా.. పునర్వ్యవస్థీకరణకు నోచుకున్న ప్రస్తుత వ్యవస్థకు ఉన్న మార్పులు, చేర్పులు ఏమిటి?
సీఈ : నీటి పారుదల శాఖలో గతంలో అనేక విభాగాలు ఉండేవి. తద్వారా లక్ష్యాలు క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఈ లోపాన్ని సవరించేందుకు సీఎం కేసీఆర్ మొత్తం వ్యవస్థను పునర్వ్యవస్థీకరించారు.జలవనరుల శాఖ పేరుతో సాగునీటి కార్యకలాపాలన్నీ నిర్వహిస్తాం. జలవనరులశాఖ పరిధిలోనే ఐడీసీ, మైనర్,మీడియం,మేజర్ ఇరిగేషన్ వ్యవస్థలన్నీ ఉంటాయి.
గోదావరి బేసిన్ కమిషనర్‌గా పని చేసిన మీరు నిజామాబాద్ సీఈగా రావడంతో మీకు అనుకూలతలు ఏమైనా ఉన్నాయా?
జలవనరుల శాఖ పునర్విభజనకు ముందు వరకు గోదావరి బేసిన్ కమిషనర్‌గా పని చేశా. ఆ హోదాలో చిట్ట చివరి పర్యటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నిర్వహించాను. కాకతాళీయంగానే జలవనరుల శాఖ సీఈగా నిజామాబాద్‌కు రావడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంపై నాకు పట్టుంది. సీఈగా మరింత పకడ్బందీగా పని చేసి రైతులకు మేలు చేసేందుకు కృషి చేస్తా. పరిధి తగ్గినా... పర్యవేక్షణ పెరుగుతుంది.
జలవనరుల శాఖ ద్వారా ఉద్యోగులకు పని విభజన విషయంలో ఏమైనా మార్పులున్నాయా?
కొత్త వ్యవస్థతో ఉద్యోగులందరికీ ఒకే రకమైన విధులు నిర్వహించడమనే పద్ధతికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఒకే గొడుగు కిందకు మొత్తం విభాగాలన్నీ రావడంతో అధికారులెవరైనా ఏ పనైనా చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. సంక్లిష్టతలకు అవకాశం ఉండబోదు. పైగా సమాన పని... సమాన బాధ్యత దక్కనుంది.
నిజామాబాద్ సీఈ పరిధిలో పునర్వ్యస్థీకరించిన ఆయకట్టు వివరాలు ?
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పాత లెక్కల ప్రకారమైతే నాలుగు రిజర్వాయర్లు ఉండేవి. ఐడీసీ కింద 49 ఎత్తిపోతల పథకాలు, 3,187 చెరువులు ఉండేవి. 12 పంప్ హౌస్‌లు సై తం వచ్చేవి. ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి రెండు వేర్వేరు కావడంతో ఆయకట్టు లె క్కలు మారాయి. నిజామాబాద్ సీఈ పరిధిలో 4లక్షల 97 వేల ఎకరాల ఆయకట్టు నిర్దేశించారు. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ప్రాంతం నిజామాబాద్ సీఈ పరిధిలోనే ప్రస్తుతానికి కలిపారు.
మొత్తం ఆయకట్టులో ఐడీసీ, మైనర్, మేజర్, మధ్యతరహా ప్రాజెక్టుల పరంగా వివరాలు?
నిజామాబాద్ సీఈ పర్యవేక్షణలో 35 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా 60వేల ఎకరాల ఆయకట్టు కవర్ అవుతోంది. మైనర్ ఇరిగేషన్ కింద 1204 చెరువులున్నాయి. లక్షా 5వేల ఎకరాలున్నది. ఎస్సారెస్పీ నిర్వహణ జగిత్యాల సీఈకి పోయినప్పటికీ లక్ష్మీ కె నాల్ మాత్రం నిజామాబాద్ జిల్లాకు వస్తుంది. దీని పరిధిలో 25వేల ఎకరాలున్నది. అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 92వేల ఎకరాలుంటుంది. మిగిలిన పైపుడ్ ఇరిగేషన్ ద్వారా 2లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. సరస్వతి కెనాల్ కాస్తా ఆదిలాబాద్ సీఈ,కాకతీయ కెనాల్,పునర్జీవ పథకాలు జగిత్యాల సీఈనియంత్రణలో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి వివరాలు చెబుతారా?
నిజామాబాద్ సీఈ పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 20, 21, 21(ఏ) కేటాయించారు. 2021 జూన్ నాటికి ప్యాకేజీ 21 ద్వారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ని వ్యవసాయ భూములకు సాగు నీరు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాము. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పనుల్లో వేగం పెంచుతున్నాము.
ఐడీసీ కింద ఉన్న ఎత్తిపోతల పథకాలపై ఎలా దృష్టి సారించనున్నారు. ఆయకట్టుకు నీటి విడుదలలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఐడీసీ కింద నిజామాబాద్ జిల్లాలో 35 ఎత్తిపోతలున్నాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా వీటిని నిర్వహణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాచరణ ఉంటుంది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం మొదలైన తర్వాత ఎత్తిపోతలతో పుష్కలంగా నీరు ఎత్తిపోసుకునేందుకు మరింత వీలు కలుగుతుంది. మరమ్మతుల విషయంలోనూ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటాం.
తాజావార్తలు
- నల్లటి వలయాలను తగ్గించేందుకు ఇవి తింటే చాలు
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్‌లో విద్యాబాలన్ సినిమా నట్‌ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- తెలంగాణ-గుజరాత్ల మధ్య అవగాహన ఒప్పందం