ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Jan 11, 2021 , 00:06:07

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరికలు

రెంజల్‌, జనవరి 10: టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసలు కొన సాగు తున్నాయి. మండ లంలోని తాడ్‌బిలోలి  సర్పంచ్‌ వెల్మల సునీత, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ నర్సయ్య ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే షకీల్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు సర్పంచ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌ మస్కూరి లక్ష్మి, వార్డు సభ్యులు నారాయణరెడ్డి, ఫకూర్‌బేగ్‌  ఉన్నారు.