సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Jan 11, 2021 , 00:09:33

విలువలతో కూడిన విద్య అవసరం

విలువలతో కూడిన విద్య అవసరం

సామాజిక మార్పులోఉపాధ్యాయుల పాత్ర కీలకం

అందరికీ స్ఫూర్తిగా నిలవాలి 

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు,   పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్‌ 

మోపాల్‌ (ఖలీల్‌వాడి), జనవరి 10: సామాజిక మార్పులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పద్మభూషణ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. మోపాల్‌ మండల కేంద్రంలోని బోర్గాం (పీ) గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నర్రా రామారావు ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపీచంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తమ ఉపాధ్యాయులతో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో మార్పు తీసుకువస్తారని, అందరికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఉన్నత విలువలు కలిగి ఉంటే సమాజంలో ఎలాంటి సమస్యలు రావన్నారు. మంచి విలువలను బోధించాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన నర్రా రామారావును అభినందించారు. అందరి సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుందని అన్నారు. అనంతరం నర్రా రామారావు మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్న పుల్లెల గోపీచంద్‌కు అభినందనలు తెలిపారు. భారతదేశ కీర్తిని దశ దిశలా చాటుతున్నారని కొనియాడారు. అనంతరం నర్రా రామారావు, గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు. అంతకుముందు పాఠశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమంలో నాగజ్యోతి, ఈగ నర్సారెడ్డి,  డాక్టర్‌ గోపీకృష్ణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.logo