శనివారం 23 జనవరి 2021
Nizamabad - Jan 10, 2021 , 00:29:55

అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌ రూరల్‌, జనవరి 9: అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని   టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దయానంద్‌, నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శి అమృత్‌కుమార్‌ అన్నా రు. నగర శివారులోని మాధవనగర్‌ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్చక ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చక ఉద్యోగులకు సైతం నూతన పీఆర్‌సీని వర్తింపజేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నా రు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.  ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించాలని అర్చక ఉద్యోగులు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల అర్చక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి సురేందర్‌, టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఈవోలు శ్రీరాం రవీందర్‌గుప్తా, సీహెచ్‌.వెంకట్‌నారాయణ, రాంరెడ్డి, వేణు, శ్రీధర్‌రావు, అర్చక ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం టీఎన్జీవోస్‌ నాయకులను అర్చక ఉద్యోగులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. 


logo