క్యాంప్ కార్యాలయాల నిర్మాణ ఘనత సీఎం కేసీఆర్‌దే..

రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్ రూరల్, జనవరి 9: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల భవన నిర్మాణ పనులకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నగర శివారులోని ఆర్యనగర్‌లో రూ.కోటి వ్యయంతో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులను పంచాయతీరాజ్ డీఈ శంకర్, ఏఈ నరేశ్, టీఆర్ఎస్ నాయకులు దాసరి లక్ష్మీనర్సయ్య, ప్రవీణ్‌గౌడ్, గంగదాస్తో కలిసి శనివారం పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపు కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తికాగానే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవచూపాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందులోభాగంగానే క్యాంపు కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టారని అన్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి మంజూరుచేసిందని, ఆ నిధులు సరిపోకపోవడంతో, అన్ని హంగులతో భవన నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే కోటా నుంచి మరో రూ.25 లక్షలు కేటాయించుకునేలా ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
డిచ్పల్లి, జనవరి 9: పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండలంలోని ఘన్పూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త ఆమేటి రాజేశ్వర్ గత నెలలో వెన్నెముక ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రాజేశ్వర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆపరేషన్‌కు ఖర్చయిన రూ.2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శక్కరికొండ కృష్ణ, ఎంపీటీసీ కుర్రి సవితారామకృష్ణ, సీనియర్ నాయకులు యన్నం రాజు, సమీర్, గడ్డం గంగాధర్, భూపతి, లింబాద్రి, చిరంజీవి తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
మోపాల్ (ఖలీల్‌వాడి), జనవరి 9: నగరానికి చెందిన ఈగ సంజీవ్ రెడ్డి సోదరుడు మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి బాధితులను శనివారం పరామర్శించారు. ఆయన వెంట జడ్పీటీసీ కమలనరేశ్, నుడా డైరెక్టర్ అభిలాష్, మోహన్‌రెడ్డి, నవనీత్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ధ్యేయం
- 55 బ్లాక్ స్పాట్లు
- ఉగాది నాటికి ‘డబుల్' ఇండ్లు ఇస్తాం
- నియోజక వర్గంలోని అన్ని చౌరస్తాలు అభివృద్ధి
- అంతర్గత రోడ్లకు కొత్తరూపు
- మంచుకొండ.. అభినందనీయం
- అభవృద్ధి పనులు వేగవంతం : ఎమ్మెల్యే ముఠా గోపాల్
- రోడ్డు విస్తరణకు సన్నాహాలు
- ఆకలి తీరుస్తున్న ‘అన్నపూర్ణ’
- కామెడీ ఎప్పుడూ బోర్ కొట్టదు