మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Jan 10, 2021 , 00:29:54

నేడు జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

నేడు జిల్లాకు ఎమ్మెల్సీ కవిత

ఖలీల్‌వాడి/బోధన్‌, జనవరి 9: ఎమ్మెల్సీ కవిత ఆదివారం నిజామాబాద్‌ జిల్లాకు రానున్నారు.  పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి బోధన్‌కు చేరుకుంటారు. సాటాపూర్‌లో కార్యకర్తలు కవితకు ఘన స్వాగతం పలుకనున్నారు. అనంతరం బోధన  శివాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మేరు సంఘం, పద్మశాలీ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరిస్తారు.  రుద్ర కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో పట్టణంలోని పెగడాపల్లి రోడ్డులో నిర్వహించనున్న సంక్రాంతి ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా కవిత, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే షకీల్‌ హాజరవుతారు. కమ్మ సంఘం నాయకుడు రవికిరణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు , కౌన్సిలర్‌ గుణప్రసాద్‌, కౌన్సిలర్‌ బబ్లూ , సాలూరాలో బుద్ద రాజేశ్వర్‌, సర్పంచ్‌ను ఆమె పరామర్శించనున్నారు.