శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Jan 09, 2021 , 01:29:03

ప్రొబేషనరీ ఎస్సైలకు శిక్షణ ప్రారంభం

ప్రొబేషనరీ ఎస్సైలకు శిక్షణ ప్రారంభం

డిచ్‌పల్లి, జనవరి 8: డిచ్‌పల్లిలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్‌ ఏడో బెటాలియన్‌లో 41 మంది ప్రొబేషనరీ ఎస్సై(సివిల్‌)లకు ‘వెపన్‌ అండ్‌ టాక్టీస్‌'పై శిక్షణను బెటాలియన్‌ కమాండెంట్‌ ఎన్‌వీ సత్య శ్రీనివాస్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ మాట్లాడుతూ.. నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఆయుధాలపై ఇచ్చే ట్రైనింగ్‌ తమ సర్వీసు కాలంలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా శిక్షణను పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు బి.అనిల్‌కుమార్‌, ఎల్‌.మహేశ్‌, ఆర్‌.ప్రహ్లాద్‌, డి.వసంతరావు, ఆర్‌ఎస్సైలు, ట్రైనీ ఎస్సైలు పాల్గొన్నారు.


logo