ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Jan 09, 2021 , 01:28:43

11న జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

11న జాగృతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

ఖలీల్‌వాడి, జనవరి 8: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 11న ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు జాగృతి మహిళా విభాగం నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌ నాయక్‌వాడి అపర్ణ తెలిపారు. జాగృతి జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొవిడ్‌-19 నిబంధనల మేరకు ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌ మైదానంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతి రూ. 5వేలు, రెండో బహుమతి రూ.మూడు వేలు, మూడో  బహుమతి రూ.రెండు వేల నగదు అందజేస్తామన్నారు. అభ్యర్థులు 8309146901, 9346588394 నంబర్లను  సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జాగృ తి ప్రతినిధులు నరాల సుధాకర్‌, లక్ష్మీనారాయణ భరద్వాజ్‌, హరీశ్‌ యాదవ్‌, గోపాల్‌, విక్కీ తదితరులు పాల్గొన్నారు.