ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Jan 09, 2021 , 01:24:16

‘రూర్బన్‌' పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

‘రూర్బన్‌' పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్‌

ఇందూరు, జనవరి 8 : రూర్బన్‌ పథకం పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో రూర్బన్‌ పథకంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి 15లోగా బిల్లులను సమర్పించాలని ఆదేశించారు.  సమావేశంలో  డీఆర్డీవో  శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, డీసీవో సింహాచలం, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.