శుభాకాంక్షల వెల్లువ

నిజామాబాద్ సిటీ/ ఎల్లారెడ్డి రూరల్, జనవరి 6 : నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను బుధవారం హైదరాబాద్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పీలకు వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల గైడ్‌లైన్స్ మార్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి, ఎమ్మెల్సీతో పాటు పంచాయతీరాజ్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. జడ్పీ చైర్మన్ వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు దాదన్నగారి సందీప్‌రావు ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో బుధవారం కలిశారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఎల్లారెడ్డి అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్‌వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!