బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Jan 06, 2021 , 01:19:44

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

నేరాల నియంత్రణకు కృషి చేయాలి

  • సీపీ కార్తికేయ ఆదేశం

నిజామాబాద్‌ సిటీ, జనవరి 5: నేరాల నియంత్రణకు కృషి చేయాలని పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ సిబ్బందిని ఆదేశించారు. కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌ డివిజన్లలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో మంగవారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బహిరంగ  ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా సమీక్షించి త్వరితగతిన దర్యాప్తును ముగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోలింగ్‌ను ముమ్మరంచేయడంతోపాటు బీట్‌లను ఏర్పాటుచేయాలన్నా రు. మట్కా, గుట్కా, గంజాయి తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా సారించాలని, లాడ్జిల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. డయల్‌ 100 ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించాలన్నారు. సమావేశంలో నిజామాబాద్‌ అదనపు డీసీపీ అరవింద్‌బాబు(ట్రైనింగ్‌), ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. logo