శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Jan 03, 2021 , 00:50:12

అయ్యో ‘పాప’ం

అయ్యో ‘పాప’ం

కారేగాం వాగులో బాలిక మృతదేహం

చందూర్‌, జనవరి 02 : నిజామాబాద్‌ జిల్లా చందూర్‌ మండలంలోని కారేగాం గ్రామ శివారులోని వాగులో గుర్తు తెలియని బాలిక మృతదేహం శనివారం లభ్యమైంది. స్థానికులకు వాగులో మృతదేహం కనిపించడంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. విచారణలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లకు కూడా సమాచారం ఇచ్చామని ఎస్సై-2 నారాయణసింగ్‌, ఎస్సై -1 అనిల్‌రెడ్డి తెలిపారు. బాలిక వయస్సు 2 నుంచి 3 సంవత్సరాల మధ్య ఉంటుందని, బాలిక మృతి చెందడంతో వాగులో పడేసి పోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  


logo