గురువారం 21 జనవరి 2021
Nizamabad - Jan 02, 2021 , 00:48:19

తడినేల కాపాడింది..

తడినేల కాపాడింది..

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

ధర్పల్లి, జనవరి 1 : నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం కేంద్రంలో ఓ కారు అదుపుతప్పి సమీప పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. కారు బురదలో దూసుకెళ్లినా.. పొలం నాటువేసి ఉండడంతో అందులో ఉన్న ఐదుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. జిల్లాలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామానికి చెందిన బి.శ్రీధర్‌గౌడ్‌ సిరికొండ మండల కేంద్రంలో ఓ వివాహ విందుకు హాజరై గురువారం అర్ధరాత్రి కారులో తిరిగివస్తున్నాడు. అతడితోపాటు కారులో ఐదుగురు ఉన్నారు. ధర్పల్లి శివారులో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపు వద్ద కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. అందులో నుంచి ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ట్రాక్టర్‌ సహాయంతో శుక్రవారం ఉదయం కారును బయటికి తీశారు. 


logo