శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 31, 2020 , 01:08:04

జూమ్‌ యాప్‌ ద్వారా ‘నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌'

జూమ్‌ యాప్‌ ద్వారా ‘నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌'

  • పాల్గొన్న 14 జిల్లాల అభ్యర్థులు

ఇందూరు: నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌'ను ఈ ఏడాది నిజామాబాద్‌ నెహ్రూ యువ కేంద్ర బాధ్యులు బుధవారం నిర్వహించారు. జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన ఈ పోటీల్లో 14 జిల్లాల నుంచి 64 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ చందుపట్ల ఆంజనేయులు, తెలుగు ఉపన్యాసకులు కాసర్ల నరేశ్‌రావు, రచయిత కళా గోపాల్‌, రిటైర్డ్‌ ఎంపీడీవో బూస ఆంజనేయులు, ప్రధానమంత్రి కౌశల్‌ కేంద్ర ప్రిన్సిపాల్‌ వాసుదేవారెడ్డి, నెహ్రూ యువకేంద్ర అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ వ్యవహరించారు. జిల్లాల వారీగా ప్రథమ, ద్వితీయ విజేతలను వివిధ అంశాల ఆధారంగా ప్రతిభను గమనించి న్యాయనిర్ణేతలు ప్రకటించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి, కార్యక్రమ నిర్వాహకురాలు శైలీ బెల్లాల్‌ తెలిపారు. 

విజేతలు వీరే..  

ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలు జిల్లాల వారీగా వరుసగా.. అంబిడి దీపక్‌, కె.శ్రీనిధి(నిజామాబాద్‌), మైమూనా సుల్తానా, గడ్డంవార్‌ అవినాశ్‌(కామారెడ్డి), బి.శృతి, డబ్ల్యూ.ప్రతీక్‌(ఆదిలాబాద్‌), సి.ప్రణీత, సమ్రిన్‌బేగం(వరంగల్‌), అక్షిత, ఆకాంక్ష(వరంగల్‌ రూరల్‌), అభిషేక్‌, రవిబాబు(జనగామ), వినీత్‌, సాయి కళ్యాణ్‌(సిద్దిపేట), రాకేశ్‌, భార్గవి(సంగారెడ్డి).