బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Dec 31, 2020 , 01:07:55

ఘనంగా దత్తజయంతి వేడుకలు

ఘనంగా దత్తజయంతి వేడుకలు

ఇందూరు: నగరంలోని వినాయక్‌నగర్‌లో సద్గురుధామం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 25నుంచి వేడుకలు ప్రారంభించామని దత్తాశ్రమం వ్యవస్థాపక చైర్మన్‌ ఇప్పకాయల హరిదాసు స్వామిజీ తెలిపారు. జగద్గురు శంకరాచార్యులు స్వామిజీ, మధుసూదనానంద స్వామిజీ (శ్రీపీఠం, నాచారం గుట్ట), గుడిమెట్‌ మహదేవ్‌ స్వామిజీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగాయి. వేడుకల్లో ఏలేటి రాజిరెడ్డి, ఉమారాణి, వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు పాల్గొన్నారు. logo