శనివారం 23 జనవరి 2021
Nizamabad - Dec 30, 2020 , 01:37:58

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరిక

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరిక

బోధన్‌: ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌ సర్పంచ్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమానుల్లా షరీఫ్‌తోపాటు గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు టీఆర్‌ఎస్‌ పార్టీలో మంగళవారం చేరారు. వీరికి ఎమ్మెల్యే షకీల్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ అమానుల్లా షరీఫ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరామన్నారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మాజీ సర్పంచ్‌ అజ్గర్‌ అలీ, వార్డు సభ్యులు అబూన్‌, అన్వర్‌, జమీలా బేగం, సోహైల్‌, మహమూద్‌, అర్షియా బేగం పాల్గొన్నారు.

రైతులకు మెరుగైన సేవలు అందించాలి

ఎడపల్లి (శక్కర్‌నగర్‌): ఎరువుల దుకాణాల యజమానులు, కంపెనీలు రైతులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఆగ్రోస్‌ వారి రైతు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు సింగిల్‌ విండోలు అందిస్తున్న సేవలతోపాటు గ్రామాల వారీగా ఎరువుల దుకాణాల యజమానులు సైతం మెరుగైన సేవలు అందించాలని అన్నారు. రైతులకు పంటల సీజన్‌లకు అనుగు ణంగా ఎరువులతోపాటు విత్తనాలు కూడా నాణ్యమైనవి అందిం చాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ గిర్దావర్‌ గంగారెడ్డి, ఎడపల్లి ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్‌, ఎడపల్లి సింగిల్‌ విండో అధ్యక్షుడు మల్కారెడ్డి, నాయకులు రాజిరెడ్డి, అహ్మద్‌, ఎల్లయ్య యాదవ్‌ పాల్గొన్నారు.


logo