శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Dec 29, 2020 , 01:24:20

పర్యాటక కేంద్రంగా గోవర్ధనగిరి

పర్యాటక కేంద్రంగా గోవర్ధనగిరి

  • నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేబాజిరెడ్డి గోవర్ధన్‌ 

ధర్పల్లి : మండల కేంద్రంలోని గోవర్ధనగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. జగన్నాథ ఆలయంలో సోమవారం నిర్వహించిన విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పంచముఖి హనుమాన్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. కొండపై గార్డెన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

సంఘాల అభివృద్ధికి కృషి

కులసంఘాల అభివృద్ధికి చేయూతనందిస్తానని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. మండల కేంద్రంలోని పద్మశాలీ సంఘం నూతన కల్యాణవేదికను  సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని సంఘ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటు జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌ను సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో  ఎంపీపీ నల్ల సారికాహన్మంత్‌రెడ్డి, రైతు బంధుసమితి మండల కన్వీనర్‌ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కె.నవీన్‌రెడ్డి, సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్దబాల్‌రాజ్‌, సొసైటీ చైర్మన్‌ చెలిమెల చిన్నారెడ్డి, ఎంపీటీసీ సుజావుద్దీన్‌, ధర్పల్లి వీడీసీ చైర్మన్‌ రంజిత్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కొండా శేఖర్‌, నాయకులు మనోహర్‌రెడ్డి, కిశోర్‌రెడ్డి, సురేందర్‌గౌడ్‌, గోపాల్‌, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.