శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 29, 2020 , 01:24:22

మహిళై ఉండి.. ఎంపీ అర్వింద్‌ కామెంట్లను సమర్థిస్తారా?

మహిళై ఉండి.. ఎంపీ అర్వింద్‌ కామెంట్లను సమర్థిస్తారా?

  • బీజేపీ ఫ్లోర్‌లీడర్‌కు నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్న

ఖలీల్‌వాడి: మహిళలపై ఎంపీ అర్వింద్‌ చేసిన కామెంట్లను మహిళై ఉండి బీజేపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ స్రవంతిరెడ్డి సమర్థిస్తారా అని నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తాను మహిళననే విషయాన్ని మర్చిపోవద్దని స్రవంతిరెడ్డికి హితవు పలికారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో అర్వింద్‌ కమిషన్‌ ఏజెంట్‌గా పనిచేస్తే ఎల్‌ అండ్‌ టీ సంస్థ వారు పారిపోయారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత, అర్బన్‌ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా నిరంతరం పర్యవేక్షిస్తూ పనులనుపూర్తి చేయించారన్నారు. అసలు విషయాలు తెలసుకోకుండా స్థాయికి మించి మాట్లాడవద్దని ఆయన అన్నారు. నుడా డైరెక్టర్లు అక్తర్‌ఖాన్‌, శ్రీహరి , ఫ్లోర్‌లీడర్‌ ఎనుగందుల మురళి, చరణ్‌, నవీన్‌, ధర్మపురి అక్బర్‌, విక్రంగౌడ్‌, శంకర్‌, పంచరెడ్డి సూరి పాల్గ్గొన్నారు.