హైవే పై అలర్ట్..

- ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
- ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- జాతీయ రహదారిపై ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 సోలార్ బిగ్గర్స్ ఏర్పాటు చేసిన అధికారులు
- 60 కిలో మీటర్ల పొడవున 254 ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
- జాతీయ రహదారిపై అందుబాటులో 1033 టోల్‌ఫ్రీ బాక్సులు
జాతీయ రహదారిపై జరుగుతున్న వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 కిలోమీటర్ల పొడవున 254 ప్రమాద హెచ్చరిక బోర్డులు, 54 సోలార్ బిగ్గర్స్, అత్యవసర సమయాల్లో సహాయం కోసం 1033 టోల్‌ఫ్రీ బాక్సులను ఏర్పాటు చేశారు.
-డిచ్పల్లి
డిచ్పల్లి: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని నవయుగ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా పరిధిలోని 60 కిలోమీటర్ల పొడవున ఉన్న హైవేపై 254 ప్రమాద హెచ్చరిక బోర్డులను కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గతంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరిగేవి. ఏడాది పొడువునా ఎన్నో సంఘటనలు చోటు చేసుకొని వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటి నివారణ కోసం పటిష్ట చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా హైవేపై 54 సోలార్ బిగ్గర్స్ ఏర్పాటు చేశారు. సోలార్‌తో వెలిగే ఈ బల్బులు వాహన వేగాన్ని తగ్గించుకునే విధంగా సూచిస్తాయి. మూలమలుపులు తెలిసే విధంగా బోర్డులను ఏర్పాటు చేశారు. హైవేకు అక్కడక్కడ 1033 టోల్ ఫ్రీ నంబర్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగితే సమీపంలో ఉన్న బాక్సు నుంచి టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంటారు. వాహనం పాడైనా, టైర్లు పంక్చర్ అయినా టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తగిన సహాయం పొందే అవకాశం కల్పించారు. ఈ విషయం తెలియక చాలా మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బోర్డులు, సోలార్ బిగ్గర్స్ ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారిపై ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. బోర్డులను చూసైనా వాహనదారులు నెమ్మదిగా వెళ్తారని హైవేకు ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం..
ప్రమాదాల నివార ణ కోసం మూల మలుపులు, ప్రమాదా లు జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాహ న వేగాన్ని నియంత్రిం చడం కోసం సోలార్ బిగ్గర్స్తో లైట్లను ఏర్పా టు చేశాం. అత్యవసరం ఉంటే.. సమీపంలో ఉన్న బ్యాక్స్ ద్వారా 1033 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సహాయక బృందం అక్కడికి వచ్చి తగిన సహాయం అందిస్తారు.
- జలపతిరావు, ఇందల్వాయి టోల్‌ప్లాజా మేనేజర్.
తాజావార్తలు
- మేడారం చిన్న జాతర తేదీలు ఖరారు
- 110 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టిన వాషింగ్టన్ సుందర్
- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- హిమాచల్ పంచాయతీ పోల్స్.. ఓటేసిన 103 ఏళ్ల వృద్ధుడు
- షూటింగ్ పూర్తి చేసిన పూజాహెగ్డే..!
- 7,000mAh బ్యాటరీతో వస్తున్న శాంసంగ్ కొత్త ఫోన్..!
- 26న లక్ష ట్రాక్టర్లతో ఢిల్లీలో ర్యాలీ: పంజాబ్ రైతులు
- అయోధ్య గుడికి రూ.100 కోట్ల విరాళాలు
- రైతుల్లో చాలామంది వ్యవసాయ చట్టాలకు అనుకూలమే: కేంద్రం